ప్రథమ సంవత్సరం డిగ్రీ అడ్మిషన్లను తక్షణం ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ పిడిఎస్ఓ ఆధ్వర్యంలో డాక్టర్ వి.ఎస్.కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఎదుట నిరసన జరిగింది.
పిడిఎస్ఓ విశాఖ జిల్లా కార్యదర్శి వి.లక్ష్మి మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమై 20 రోజులు గడిచినా అడ్మిషన్ నోటిఫికేషన్ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, ఇంటర్ ఫలితాలు రెండు నెలల క్రితం వచ్చినా ఇప్పటివరకు నోటిఫికేషన్ రాకపోవడంతో విద్యార్థులు ఇతర కోర్సుల వైపు మొగ్గుతున్నారని తెలిపారు. దీనివల్ల డిగ్రీలో చేరే వారి సంఖ్య తగ్గుతోందని, రాష్ట్రంలో 4.5 లక్షల డిగ్రీ సీట్లలో 50% కూడా గతేడాది భర్తీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అడ్మిషన్ ప్రక్రియను ప్రారంభించాలని పిడిఎస్ఓ డిమాండ్ చేసింది.
ఈ కార్యక్రమంలో పిడిఎస్‌ఓ సభ్యులు లక్ష్మణ్, సతీష్, యమున, తులసి తదితరులు పాల్గొన్నారు.