ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (PDSO) ఆధ్వర్యంలో అనంతపురం బస్టాండ్ వద్ద "సేవ్ ఆర్‌డీటీ" ర్యాలీ చేపట్టారు. రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్‌డీటీ) యొక్క ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని PDSO డిమాండ్ చేసింది. 55 ఏళ్లుగా ఆర్‌డీటీ పేదల కోసం ఆసుపత్రులు, పాఠశాలలు, గృహాలు, మహిళల సాధికారత, పర్యావరణ కార్యక్రమాల ద్వారా గ్రామీణాభివృద్ధికి కృషి చేసింది. ఆర్‌డీటీ సేవలను కొనసాగించేందుకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని, కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని పీడీఎస్ఓ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలోజిల్లా కన్వీనర్ ఎస్.అశోక్, కో-కన్వీనర్ సంజీవ్ రాజు, కమిటీ సభ్యులు సంపత్, జశ్వంత్, దాదు పాల్గొన్నారు.