#MayDay

0
శ్రమజీవి కండరాలపైని
స్వేదబిందువుని
అదృశ్య శక్తులు
అపహరించే వేళ
దోపిడీని అధ్యయనం చెయ్
మోడు
ఎముకల గూడై
అర్థించే ఆకలి కొమ్మల చేతుల్నీ
అనుక్షణం
అంతస్తుల రాతి పాదాల కింద పడి విరిగే
ఈ దేశపు దారిద్ర్య జీవన శిథిలాల్నీ
అధ్యయనం చెయ్
- అలిశెట్టి ప్రభాకర్

Post a Comment

0Comments
Post a Comment (0)