విశ్వోదయ ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యల పరిష్కారం కొరకు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ పిడిఎస్ఓ ఆధ్వర్యంలో సోమవారం కళాశాల విద్యార్థినీ విద్యార్థులంతా కళాశాల నుంచి ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీగా వచ్చి ధర్నా నిర్వహించారు.
జూనియర్ డిగ్రీ కాలేజీలు1968లో ప్రైవేటు మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పడినాయి. 1977లో కాలేజీ భవనాలు, మొత్తం స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించారు. జూనియర్, డిగ్రీ కళాశాలలు కలిపి కాంపోజిట్ కాలేజీ గా ఉండేది. 2002లో జూనియర్ కాలేజీని డిగ్రీ కాలేజ్ నుంచి విడగొట్టారు. 2007లో విశ్వోదయస్థలాలు వేలంపాటలు జరగగా ప్రైవేట్ వ్యక్తులు కొంత స్థలాన్ని పాడుకున్నారు. ఇదే సమయంలో డిగ్రీ కాలేజీని తిరుపతి రోడ్లోకి తరలించగా స్థలాలు, భవనాలు ఇక్కడే ఉండిపోయాయి. ఈ భవనాలను, స్థలాన్ని జూనియర్ కాలేజీకి అప్పగించే ప్రక్రియ ఆగిపోయింది. విశ్వోదయ ఆస్తులను జూనియర్ కళాశాలకు బదలాయించి, చుట్టూ కొలతలు జరిపి బౌండరీ ఫిక్స్ చేయాలని, ప్రహరీ గోడ నిర్మించి కాలేజీకి రక్షణ కల్పించాలని పిడిఎస్ఓ డిమాండ్ చేస్తున్నది.


