దేశంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలను ఖండిస్తూ, అత్యాచారాలకు కారణమవుతున్న మద్యం, మత్తు పదార్థాలను నిషేధించాలని, సినిమా, టి.వి, ఇంటర్నెట్ లో స్త్రీను భోగవస్తువుగా చూపించే సామ్రాజ్యవాద విష సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడాలని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వివిధ హాస్టళ్లు, కళాశాలలో ప్రచారం జరిగింది. ఈ కార్యక్రమంలో పిడిఎస్ఓ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.ఆష, రాష్ట్ర నాయకులు కె.తిరుమలేష్, జిల్లా నాయకులు సురేంద్ర, నిఖిత తదితరులు పాల్గొన్నారు.







