1917 నవంబర్ 7 చరిత్ర ఎర్రసిరాతో లిఖించిన నూతన అధ్యాయం. అప్పటివరకు విప్లవాలన్నీ దోపిడీ చేసే వర్గం స్థానంలో మరో దోపిడీ వర్గం నాయకత్వంలో వచ్చినవే. కానీ, సోవియట్ విప్లవం వాటికి పూర్తిగా భిన్నమైంది. దోపిడీకి గురయ్యే కార్మికవర్గం నాయకత్వంలో వచ్చిన శ్రామికవిప్లవమది. దోపిడీ లేని సమసమాజాన్ని ఆవిష్కరించిన విప్లవమది. దాన్ని పురిట్లోనే గొంతు పిసికి చంపాలని ప్రపంచంలోని అన్ని రకాల దోపిడీశక్తులు ఏకమయ్యాయి. రష్యాలోని విప్లవ ప్రతీఘాత శక్తులకు ఆయుధ, ధన, మిలటరీ సహాయం చేశాయి. అయినా కార్మిక, కర్షకబలం, లెనిన్ వ్యూహరచన, కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం ముందు అవి పటాపంచలయ్యాయి.

