“ఉత్తరాంధ్ర కరువు, వలసలు - విద్యా, ఉపాధి రంగ సమస్యలు - కర్తవ్యాలు" అనే అంశంపై జరిగే ఉత్తరాంధ్ర విద్యార్థుల సదస్సును విజయవంతం చేయండి!

0
తేదీ, సమయం : నవంబర్ 15, శుక్రవారం, ఉదయం 10.30 గం.లకు
వేదిక : ఎమ్.ఆర్ లేడీస్ క్లబ్, ఎమ్.ఆర్ స్టేడియం ఎదురుగా, విజయనగరం
కార్యక్రమం:
అధ్యక్షత : కె.సోమేష్, బి.రాకేష్, పిడిఎస్ఓ నాయకులు, ఉమ్మడి విజయనగరం
ప్రారంభకులు : డా.డి.వి.జి.శంకరరావు, చైర్మన్, ఎస్టీ కమీషన్
ముఖ్య అతిధి : పాకలపాటి రఘువర్మ, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్ఎల్సి
వక్తలు: వై.వి.ఎస్.మహదేవ్, కేంద్ర-రాష్ట్ర మాజీ సలహాదారు
    కె.భానుమూర్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపిటిఎఫ్
    ఎ. సురేష్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి, పిడిఎస్ఓ
    పి.మోహనరావు, జనసాహితి
    ఎన్.భాస్కర్, రాష్ట్ర అధ్యక్షుడు, పిడిఎస్ఓ
    ఎం.అప్పలరాజు, నవయువసమాఖ్య
    పీడిక అసిరి, గిరిజన నాయకులు
ప్రజా సాంస్కృతిక కార్యక్రమాలు కలవు
డిమాండ్స్:
  • రాష్ట్ర విభజన చట్టంలోని విద్యాసంస్థలన్నింటికీ నిధులు కేటాయించి, పూర్తి చేయాలి.
  • ఆంధ్రా యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీలలోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి.
  • విశాఖలో సెంట్రల్ యూనివర్శిటీ హామీని అమలు చేయాలి.
  • విజయనగరం ఎమ్.ఆర్, విశాఖ ఏ.వి.ఎన్, అనకాపల్లి ఏ.ఎమ్.ఏ.ఎల్, పార్వతీపురం వెంకటేశ్వర, బొబ్బిలి రాజా ఎయిడెడ్ కళాశాలలకు ప్రభుత్వ ఎయిడ్ అందించాలి.
  • పాఠశాలల మూసివేతను ఆపాలి.విద్యార్థులకు సమీపంలో పాఠశాలలను ఏర్పాటు చేయాలి.
  • ఆశ్రమ పాఠశాలలకు, సాంఘిక, సంక్షేమ హాస్టళ్ళకు సరిపడా నిధులు కేటాయించి, మౌళిక వసతులు కల్పించాలి.
  • స్థానిక పంటలైన జీడి, మామిడి, చెరుకు, కొబ్బరి వంటి పంటల ఉత్పాదకత పెరిగే పరిశోధనలు జరిపేలా వ్యవసాయ విశ్వవిద్యాలయ కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
  • మూతపడ్డ జ్యూట్, చక్కెర తదితర వ్యవసాయాధారిత పరిశ్రమలను తెరిపించాలి.
  • విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేసి, రైల్వే డివిజన్ కొనసాగించాలి.
  • విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రయివేటీకరణను తక్షణమే విరమించుకోవాలి. ఇతర ప్రభుత్వ రంగ పరిశ్రమలను పటిష్ట పరచాలి.
  • గిరిజన ప్రాంతాల్లో అటవీ సంపదపై హక్కు స్థానికులకే చెందేలా 1/70 చట్టం, అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలుచేయాలి.
  • సముద్ర తీర ప్రాంతాన్ని, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ మత్స్యకారులకు ఉపాధి కల్పించాలి.
  • గంగవరం పోర్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, భావనపాడు, కళింగపట్నం, భీమునిపట్నంలో ప్రభుత్వమే మైనర్ పోర్టులు నిర్మించాలి.
  • కొవ్వాడ అణువిద్యుత్ ఫ్లాంట్‌ను తక్షణమే ఆపాలి.
  • పెండింగ్‌లో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి.
  • కెజిహెచ్, రిమ్స్, విమ్స్ మరియు అన్ని ఏరియా ఆసుపత్రులలో వైద్యులు, వైద్య సిబ్బందిని నియమించాలి.
  • పలాసలో కిడ్నీ వ్యాధి రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి.
విప్లవాభినందనలతో...
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (PDSO)
ఉత్తరాంధ్ర జిల్లాలు

03-11-2024
విజయనగరం
వివరాలకు: 9392956025, 8341718049, 81435352303



Post a Comment

0Comments
Post a Comment (0)