పాఠశాలల సమస్యల పరిష్కారానికై జరిగే ప్రచార, ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయండి!

0
తేదీలు: జులై 15, 16, 17 - 2025
1. పాఠశాలల విలీనాన్ని ఆపి, మూసివేసిన పాఠశాలలను తెరవాలి.
2. పాఠశాలల విలీనాలకు కారణమౌతున్న జీ.ఓ. నెం. 19, 21లను రద్దు చేయాలి.
3. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టుల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలి.
4. ఏజెన్సీలో ప్రత్యేక గిరిజన డీఎస్సీ నిర్వహించాలి.
5. 6, 7 తరగతులున్న పాఠశాలలకు 4 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 6-8 తరగతులున్న వాటికి 6 పోస్టులు కొనసాగించాలి.
6. ప్రతి ప్రాథమిక పాఠశాలకు కనీసం 2 ఎస్‌జీటీ పోస్టులు మంజూరు చేయాలి.
7. ఉన్నత పాఠశాలలకు హెచ్‌ఎం, పీడీ పోస్టులను మంజూరు చేయాలి.
8. "తల్లికి వందనం" కింద ప్రతి పిల్లవాడికి రూ.15,000 ఆర్థిక సాయం అందించాలి.
9. హైస్కూల్ విద్య వరకు మాతృభాషా మాధ్యమాన్ని కొనసాగించాలి.
10. నాణ్యమైన మధ్యాహ్న భోజనం, అల్పాహారం అందించాలి.
11. పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, ఆటస్థలం, సైకిల్ స్టాండ్‌లు తదితర మౌళిక సదుపాయాలు కల్పించాలి.
12. పట్టణ, గ్రామ, గిరిజన ప్రాంతాల్లో తగిన సంఖ్యలో పాఠశాలలు ఏర్పాటు చేయాలి.
13. పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి.
14. హాస్టల్ మెస్, కాస్మెటిక్, మెయింటెనెన్స్ ఛార్జీలను పెంచాలి.
15. హాస్టళ్లలో ఖాళీ కుక్, కమాటి, వాచ్‌మెన్ పోస్టులను భర్తీ చేయాలి.
16. హాస్టళ్లలో ఆరోగ్య పరీక్షలు జరపాలి. దోమతెరలు, ఆరోగ్య కిట్‌లు అందించాలి.
17. హాస్టళ్లలో ఏఎన్‌ఎం, వాచ్‌మెన్ పోస్టులను భర్తీ చేయాలి.
18. అక్రమ ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ఫీజు రెగ్యులేటరీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి.
19. జాతీయ విద్యా విధానం-2020ను రద్దు చేయాలి.
20. కేంద్రం జీడీపీలో 6%, రాష్ట్రం 20% నిధులను విద్యకు కేటాయించాలి.
21. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి.
22. సమాన విద్య కోసం కామన్ స్కూల్ విధానం అమలు చేయాలి.
విప్లవాభినందనలతో...
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (PDSO), ఆంధ్రప్రదేశ్
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)