BEST యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతుగా నిలిచి, "Hunger Strike" లో పాల్గొన్న అనంతపురం PDSO నాయకులు

0
    భారతీయ ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ (BEST) అనే ప్రైవేటు యూనివర్సిటీ అనంతపురం క్యాంపస్‌లో అడ్మిషన్ పొందిన విద్యార్థులను విద్యా సంవత్సరం మధ్యలో 100 కి.మీ దూరంలో గోరంట్ల క్యాంపస్‌కు అర్థంతరంగా మార్చటం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. విద్యార్థి తల్లితండ్రులకు ఆర్థికంగా ఇబ్బందులు, బిల్డింగ్ లో సదుపాయాలు సరిగ్గా ఉండకపోవటం, Faculty కొరత ఉండటం, హాస్టల్ లో వసతులు సదుపాయాలు లేకపోవటం, ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే హాస్పిటల్ 20-30 km దూరంలో ఉండటం, అమ్మాయిలకు సెక్యూరిటీ లేకపోవటం, ఇలా అనేక సమస్యలు ఉండటంతో గోరంట్లలో ఉన్నటువంటి క్యాంపస్ కు మేము వెళ్ళమని వారం రోజుల క్రితం విద్యార్థులు కళ్యాణదుర్గం రోడ్డు నందు ఉన్నటువంటి క్యాంపస్ లో విద్యార్థులు ధర్నాను నిర్వహించారు. అయినప్పటికీ వారి సమస్యలు పరిష్కారం అవ్వకపోవటంతో 25వ తేదీ రాత్రి "Hunger Strike" కు సిద్ధమయ్యారు. అనంతపురం PDSO నాయకులు వారితో కలిసి "Hunger Strike" లో పాల్గొని విద్యార్థులకు మద్దతుగా నిలిచారు.
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)