విజయవాడలో జరిగే జరిగిన విజయవంతం కార్మిక - కర్షక మహాధర్నా

0
    కార్మిక, రైతు సంఘాల జాతీయ ఐక్య వేదిక పిలుపు మేరకు ఆదివారం దేశ వ్యాపితంగా పలు నగరాల్లో మహా పడావ్‌ (రాత్రి, పగలు ధర్నా)లు మొదలయ్యాయి. సిమ్లా నుంచి చెన్నై వరకు, ఇటు కొల్‌కతా నుంచి రాంచీ వరకు రైతులు కార్మికులు పెద్దయెత్తున వీటిలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా నవంబర్ 27వ తేదీన విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్‌లో కార్మిక-కర్షక మహాధర్నా ప్రారంభమైంది.
    దేశాన్ని కాపాడాలి, జీవనోపాధి కల్పించాలి, ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ ఆపాలి, కనీస వేతనం రూ.26,000గా నిర్ణయించాలి, వివాదాస్పదమైన నాలుగు లేబర్‌ కోడ్లను రద్దు చేయాలి, రైతుల పంటకు స్వామినాథన్‌ కమిషన్‌ సూచించిన ప్రకారం సి2 ప్లస్‌ 50శాతం ఎంఎస్‌పికి చట్టబద్ధత కల్పించాలి, ధరల పెరుగుదలను అరికట్టాలి, లఖింపూర్‌ ఖేరి రైతుల హత్యకు ప్రధాన కారకుడైన కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్‌ మిశ్రాను మంత్రివర్గం నుంచి తొలగించి, ప్రాసిక్యూట్‌ చేయాలి, జాతీయ విద్యావిధానం-2020 రద్దు చేయాలి వంటి డిమాండ్లతో ఈ మహాధర్నా సాగుతుంది.
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)