పర్యావరణాన్ని విధ్వంసం చేసే అటవీ సంరక్షణ (సవరణ) చట్టం - 2023ని రద్దు చేయాలని ఆదివాసీ విద్యార్థుల సదస్సు

0
    పర్యావరణాన్ని ధ్వంసం చేస్తే అటవీ సంరక్షణ సవరణ చట్టం - 2023ని వ్యతిరేకిస్తూ పిడిఎస్ఓ - ఎన్.వై.ఎస్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలోని తల్లాడి సత్తిపండు గౌడ సంఘం హాల్లో ఆదివాసి విద్యార్థుల సదస్సు నిర్వహించడం జరిగింది.
    పిడిఎస్ఓ జిల్లా కార్యదర్శి ఎస్.మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ప్రధాన వక్తగా విచ్చేసిన పిడిఎస్ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.సురేష్ మాట్లాడుతూ "ఈనాడు అడవుల విస్తీర్ణం తగ్గిపోతగ్గిపోయి, భూతాపం పెరిగి పోతున్న నేపథ్యంలో అడవుల సంరక్షణకు కఠిన నిర్ణయాలు అవలంబించాల్సిన ప్రభుత్వాలు, ఉన్న చట్టాలను సరళం చేసి అడవుల తరుగుదలను ప్రోత్సహించే విధంగా అనేక విధానాలను అవలంబిస్తున్నారు. వాటిలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అటవీ సంరక్షణ చట్టం-2023 కు సవరణ చేసి వాస్తవాధీన రేఖ నుండి దేశం లోపలకి 100 కిలోమీటర్ల పరిధిలో గల 7 లక్షల చదరపు కిలోమీటర్ల భూమి ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లే విధంగా చట్టాన్ని రూపొందించారు. దీని వలన రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలుబొమ్మగా మారడమే కాకుండా అప్పటివరకు ఆ ప్రాంత గిరిజనులకు అండగా ఉన్నటువంటి అటవీ హక్కుల చట్టం - 2006, గ్రామ పంచాయితీ తీర్మానం, పీసా చట్టం ను కొత్త చట్టంలో తొలగించడం వలన వాళ్ళ యొక్క హక్కులను కాలరాస్తుంది. అడవులలో నిక్షిప్తమై ఉన్న సహజ సంపదను యదేచ్చగా తరలించుకుపోయే విధంగా అనుమతులు కల్పించడం వలన సంపద తరలిపోయే ప్రమాదం ఉంది. ఈ చట్టాల వలన పర్యావరణం దెబ్బతినడమే కాకుండా గిరిజన ప్రజల సంస్కృతి సాంప్రదాయలు దెబ్బతినడం, గిరిజన విద్యార్థులు చదువుకు మరింత దూరమయ్యే ప్రమాదం ఉంది. కనుక విద్యార్థులు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను వెనక్కు తీసుకునేంతవరకు పోరాడాల్సిన అవసరం ఉంది" అన్నారు.
    ఎన్.వై.ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కె. భాష మాట్లాడుతూ "దేశ భౌగోళిక విస్తీర్ణం, ప్రజల అవసరాల రీత్యా కనీసం ఉండాల్సిన అడవుల విస్తీర్ణం 33%, కానీ ప్రస్తుతం మన దేశంలో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (FSI) నివేదికల ప్రకారం అడవుల విస్తీర్ణం 21.72%గా ఉంది. చట్టాన్ని సరళతరం చేయడం వల్ల ఈ వ్యత్యాసాన్ని ఏ విధంగా పూడ్చి పర్యావరణ సమతూకాన్ని తేగలుగుతాం? అలాగే ఇటువంటి చట్టాలు అమలు వలన అడవులు పర్యావరణం దెబ్బతిని వర్షాభావ పరిస్థితులు ఏర్పడి పంటలు పండక కరువులకు లోనయ్యే ప్రమాదం ఎంతైనా ఉంది. మన ప్రాంతంలోనే పోలవరం ప్రాజెక్టు పేరుతో గిరిజనులపై జరిగిన విధ్వంసం నేటికి మనం మరువలేనది. ఈ చట్టాలు కనుక అమలు జరిగితే దాని నష్టం మరింత భారీగా ఉంటుంది. అందువలన ఈ పర్యావరణ విధ్వంసకర చట్టాలను యువత తీవ్రంగా వ్యతిరేకించాల్సి ఉంది" అన్నారు.
    ఈ కార్యక్రమంలో ఏజెన్సీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కుంజం రామారావు గారు మాట్లాడగా, విద్యార్థినీ, విద్యార్థులు మరియు గిరిజన గ్రామాల యువత పాల్గొన్నారు.
విప్లవాభినందనలతో…
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(PDSO),
ఏలూరు జిల్లా






Tags

Post a Comment

0Comments
Post a Comment (0)