మనిషన్నవాడు జీవించాలి!

0
నేను మట్టిగావడం కంటే
బూడిదగావడానికే ఇష్టపడతాను.
కుళ్లి కృశించి నశించడానికి బదులు
నాలోని ప్రతి అణువూ
భగ భగ మండే మంటల్లో ఆహుతవ్వాలనుకుంటాను. మందకొడిగా ఒక శాశ్వత గ్రహంగా ఉండడంకంటే
దేదీప్యమానంగా వెలిగి
పతనమయ్యే అద్భుతమైన ఉల్కగా మారాలనుకుంటాను.
మనిషన్నవాడు జీవించాలి.
బతుకీడ్చడం కాదు.

Post a Comment

0Comments
Post a Comment (0)