శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో "భారత జాతీయోద్యమం - మహోజ్వల వారసత్వం" - పుస్తక ఆవిష్కరణ సభ

0
PDSO, NYS ప్రచురించినటువంటి "భారత జాతీయోద్యమం - మహోజ్వల వారసత్వం" అనే పుస్తకావిష్కరణ సభ ఎస్వీయూ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ ఆడిటోరియంలో జరిగింది.
ఈ సభకు అధ్యక్షత వహించిన PDSO రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.ఆష మాట్లాడుతూ బ్రిటిష్ వాడు భారతదేశానికి వ్యాపారం కోసం అని వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో దాదాపు 200 సంవత్సరాలకు పైగా సంపదనంతా కొల్లగొట్టుకుపోతే, నేడు ఎన్నో సామ్రాజ్యవాద బహుళ జాతి కంపెనీలు భారతదేశాన్ని కొల్లగొడుతున్నాయి అన్నారు. దోపిడీ శక్తులకు వ్యతిరేకంగా ప్రజలు సాగిస్తున్న ఉద్యమాలలో విద్యార్థులు భాగస్వాములు కావాలన్నారు.
- ఎస్వీయూ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ మాజీ ప్రిన్సిపాల్ డి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ పుస్తకంలో స్వతంత్ర భారతం కొరకు ఆనాడు కార్మికులు, రైతులు, మహిళలు, విద్యార్థులు, యువకులు చేపట్టిన మహత్తరమైన పోరాటాల చరిత్ర ఉంది. ఈ పోరాటాల చరిత్రని నేడు విద్యార్థులు అధ్యయనం చేసి, వారి వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్నారు.
- ప్రొ౹౹ మురళి మాట్లాడుతూ ఎన్నో భౌగోళిక ఆవిష్కరణలు జరిగి టెక్నికల్ యుగంలో మనం ఉన్నప్పటికీ నేడు భారతదేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక వ్యవస్థలు సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నాయి. ఈ సంక్షోభానికి వ్యతిరేకంగా విద్యార్థులు చైతన్యవంతులు కావాలి అన్నారు.
౼ డా॥ గోవిందులు మాట్లాడుతూ దోపిడి వర్గాల దీర్ఘకాల ప్రయోజనాల కోసం గాంధీ శాంతియుత,అహింస పద్ధతుల పేరుతో ఉవ్వెత్తున లేస్తున్నటువంటి ప్రజా ఉద్యమాల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడనీ, నేడున్న ప్రభుత్వాలు అసలైన చరిత్రని వక్రీకరించి విద్యార్థుల్ని, యువకుల్ని పక్కదారి పట్టిస్తున్నాయి అన్నారు. భారతదేశంలోని అశేష ప్రజానీకం అనుభవిస్తున్న దుర్భరమైన పరిస్థితుల నుంచి, సంక్షోభం నుంచి బయటపడాలంటే పోరాటం తప్ప వేరొక మార్గం లేదు అన్నారు.
ఈ కార్యక్రమంలో పిడిఎస్ఓ విద్యార్థి నాయకులు రెహమాన్, ఉదయ్ కుమార్, సాగర్ మరియు 90 విద్యార్థులు పాల్గొన్నారు.
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)