కర్నూలు జిల్లా ఆదోనిలో 'భారత జాతీయోద్యమం-మహోజ్వల వారసత్వం' పుస్తక ఆవిష్కరణ సభ

0
కర్నూలు జిల్లా ఆదోనిలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (PDSO) ఆధ్వర్యంలో నేడు మహాల్తీ ఫంక్షన్ హాల్ లో భారత జాతీయోద్యమం - మహోజ్వల వారసత్వం అనే పుస్తకావిష్కరణ సభ జరిగినది.
ఈ సభకు అధ్యక్షత వహించిన PDSO జిల్లా కన్వీనర్ K. తిరుమలేష్ మాట్లాడుతూ నేడు పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్య అందని ద్రాక్ష పండులా మారిందని, ప్రభుత్వాలు అమలు చేస్తున్న విద్యా పథకాలు అన్నీ విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు అవకాశం కల్పించే విధంగా ఉన్నాయని దేశభక్తి గల పౌరులుగా అందరికీ ఉచితంగా విద్య, వైద్యం, ఉపాధి కోసం విద్యార్థులంతా పోరాడాలని అన్నారు. అలాగే ఆదోనిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
పుస్తకావిష్కర్త : PDSO రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. సురేష్ మాట్లాడుతూ ఆనాడు జాతీయోద్యమం, వందేమాతరం ఉద్యమాలలో విద్యార్థి, యువత, రైతులు, కార్మికులు అన్ని వర్గాల ప్రజలు బ్రిటిష్ దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా విదేశీ నీడ కూడా మన దేశంలో పడడానికి వీలులేదని పోరాడారు. కానీ నేడు 6500లకు పైగా స్వదేశీ, విదేశీ సామ్రాజ్యవాద కంపెనీలు మన దేశాన్ని దోచేస్తున్నాయనీ, జాతీయోద్యమ స్ఫూర్తితో వీటికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. 11వ తారీకున విశాఖపట్నం పర్యటనకు వస్తున్న మోడీ గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతున్నట్టు ప్రకటించాలని, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
PDSO రాష్ట్ర అధ్యక్షుడు N.భాస్కర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని (NEP) అమలు చేయడంలో భాగంగా జగన్ ప్రభుత్వం స్కూళ్ళ మూసివేత, ఎయిడెడ్ సంస్థల ప్రైవేటీకరణ, డిగ్రీలో మూడు సంవత్సరాల కోర్సును, నాలుగు సంవత్సరాలు చేసి, ఏ సంవత్సరంలోనైనా చదువు ఆపేయడానికి అవకాశం కల్పించడం, తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా ఎత్తివేయడం లాంటి విధానాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలకు విద్యను దూరం చేస్తున్నాయని ఇటువంటి విద్యా వ్యతిరేక విధానాలపై విద్యార్థులంతా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో PDSO జిల్లా నాయకులు తేజ, ఆదోని పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు టి.ఖాదర్ బాషా, డి.సురేష్ మరియు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)