నన్ను ప్రభుత్వం పట్టుకుని బంధిస్తుందా?
బంధించలేదు.
చంపలేదు.
ఈ భూమ్మీద ఒక్క ముండా వాడు బ్రతికివున్నా
నేను వున్నట్లే.
ఒక్కడు పంటపైరు వేసుకోగలిగితే
నేను వున్నట్లే.
ఒక్కడు చెట్టు కొమ్మలతో ఇల్లు నిలేస్తే
నేను వున్నట్లే.
పలూస్ దొరా!
నేను భూమ్మీద నశించేవాణ్ణి కాదు.
నీ చేతుల్లో ధ్వంసమయ్యేవాణ్ణి కాదు.
- బిర్సా ముండా

