అనంతపురం SSBN ఎయిడెడ్ విద్యాసంస్థలలో విద్యార్థుల స్కాలర్ షిప్ ల మొత్తం 43 లక్షల రూపాయలు, అదేవిధంగా రూసో నిధులు 3 కోట్ల 12 లక్షల రూపాయలకు పైగా యాజమాన్యం అవినీతికి పాల్పడినట్లు RTI ద్వారా బయటపడింది. దీంతో అనంతపురం జిల్లాలో ఉన్న విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. అవినీతికి పాల్పడిన యాజమాన్యంపై విచారణ జరిపించి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, అక్రమంగా తీసుకున్న నిధులను విద్యార్థులకు ఖర్చు చేయాలని, విద్యాసంస్థను పూర్తిగా ప్రభుత్వమే నిర్వహించాలనీ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నిరసన కార్యక్రమంలో PDSO నాయకులు చరణ్, నరేంద్ర, NYS నాయకులు కె.ఆంజనేయులు పాల్గొన్నారు.

