పందేలు, పోటీలు కూడా ఒక రకమైన మత్తే.
మత్తు సేవించిన మనిషి
అలాగే పిల్లలు కూడా
ఈ పోటీల వలలో చిక్కుకుని
చెడ్డపనులు చేయడం ప్రారంభిస్తారు.
పోటీలలో ఒకడే గెలుస్తాడు.
గెలవలేని మిగతాపిల్లలంతా
నిరాశా, నిస్పృహలకు బలైపోతారు.
జీవచ్చవాలుగా మిగిలిపోతారు.
గెలిచిన ఒక్కడేమో గర్విష్టిగా
ఎవరినీలెక్క చేయకుండా తయారవుతాడు.
నిజానికి పోటీ అనేది
విద్యార్థులలోని ప్రాణశక్తిని హరించివేస్తుంది.
వారిని వికృతరూపులుగా చేసి వేస్తుంది.
- గిజూభాయి

