అనంతపురంలో "భారత జాతీయోద్యమం- మహోజ్వల వారసత్వం" పుస్తక పరిచయ సభ

0
"భారత జాతీయోద్యమం- మహోజ్వల వారసత్వం" అనంతపురంలోని కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి శ్రామిక భవన్ లో పుస్తక పరిచయ సభ జరిగింది.
ఈ సభలో మానవ హక్కుల వేదిక నాయకులు చంద్రశేఖర్ పుస్తకాన్ని ఆవిష్కరించి బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జాతీయోద్యమంలో వివిధ సమూహాల ప్రజలు ఏ విధంగా పోరాడారో తెలుపుతూ, ఆజాదీ కా అమృత మహోత్సవ్ పేరు పాలకులు కుహనా దేశభక్తిని ఎలా నూరిపోస్తున్నారో వివరించారు. ప్రస్తుత నేపథ్యంలో ప్రతి విద్యార్థి, యువకుడు ఈ పుస్తకం ఎందుకు చదవాలో.. దాని ఆవశ్యకత గురించి మాట్లాడారు.
నవయువసమాఖ్య(NYS) నాయకులు కె.ఆంజనేయులు మాట్లాడుతూ జాతీయోద్యమ స్ఫూర్తితో దేశంలోని పెరుగుతున్న నిరుగోద్యానికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో PDSO నాయకులు హరి, సాయి చరణ్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)