మార్కెట్ అడవిలోకి రాగానే
ఆదివాసులకు
ఏవో కొన్ని మిషన్లతో నరికిన చెట్లు
ఇంకేవో కొన్ని జంతు కళేబరాలు కనిపించేవి
మార్కెట్ అడవిలోకి రాగానే
కాల్చిన ఖాళీ బుల్లెట్లు
వేర్లు కోల్పోయిన కొమ్మలు
చెదిరిన గూళ్ళ అవశేషాలు
పింఛాలు కత్తిరించబడ్డ నెమళ్ళు కనిపించేవి
మార్కెట్ రాగానే
నీళ్ళు కోల్పోయిన నదీ జాడలు
ప్రవాహాల్ని మింగిన ఇసుక దిబ్బలు
భూమిలో కూరుకు పోయిన
కొండల జాడలు కనిపించేవి
మార్కెట్ వచ్చిన ప్రతిసారి
ఆదివాసులకు అర్ధం కాని
ఏవో కొన్ని కొత్త పరాయి భాష పదాల్ని
ఇంకేవో కొత్తకొత్త ఆచారాల్ని, పోకడల్ని వదిలివెళ్ళేది!
మార్కెట్
అడవిలోకి వచ్చిన ప్రతిసారి
సహజ సంపదని సంచుల్లో నింపుకుని అమ్ముకునేది
ఆదివాసులకు
ఏవో కొన్ని మిషన్లతో నరికిన చెట్లు
ఇంకేవో కొన్ని జంతు కళేబరాలు కనిపించేవి
మార్కెట్ అడవిలోకి రాగానే
కాల్చిన ఖాళీ బుల్లెట్లు
వేర్లు కోల్పోయిన కొమ్మలు
చెదిరిన గూళ్ళ అవశేషాలు
పింఛాలు కత్తిరించబడ్డ నెమళ్ళు కనిపించేవి
మార్కెట్ రాగానే
నీళ్ళు కోల్పోయిన నదీ జాడలు
ప్రవాహాల్ని మింగిన ఇసుక దిబ్బలు
భూమిలో కూరుకు పోయిన
కొండల జాడలు కనిపించేవి
మార్కెట్ వచ్చిన ప్రతిసారి
ఆదివాసులకు అర్ధం కాని
ఏవో కొన్ని కొత్త పరాయి భాష పదాల్ని
ఇంకేవో కొత్తకొత్త ఆచారాల్ని, పోకడల్ని వదిలివెళ్ళేది!
మార్కెట్
అడవిలోకి వచ్చిన ప్రతిసారి
సహజ సంపదని సంచుల్లో నింపుకుని అమ్ముకునేది
హిందీ మూలం: ధనుజయ్ మల్లిక్
అనుసృజన: పి. విద్యాసాగర్
#WorldIndigenousPeoplesDay #PDSO

