చోడవరం: చోడవరంలో హైస్కూల్‌లో పిడిఎస్ఓ ఆధ్వర్యంలో విద్యార్థులతో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పిడిఎస్ఓ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. భాస్కర్ మాట్లాడుతూ, వైసిపి ప్రభుత్వం జీవో నెంబర్ 117 ద్వారా పాఠశాల వ్యవస్థను నాశనం చేసిందని, ఈ జీవోను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆ హామీని అమలు చేయలేదని ఆరోపించారు. 50 వేల చోడవరంలో హైస్కూల్‌లో పిడిఎస్ఓ ఆధ్వర్యంలో విద్యార్థులతో నిరసన పోస్టులు ఖాళీగా ఉండగా, కేవలం 16,343 పోస్టులను మెగా డీఎస్సీగా ప్రచారం చేస్తున్నారని, రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 63,408 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని విమర్శించారు. తల్లికి వందనం పథకం విద్యార్థులను ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు మళ్లిస్తోందని, జీవో 19, 21లను రద్దు చేయాలని, మూసివేసిన పాఠశాలలను తెరవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పిడిఎస్ఓ జిల్లా నాయకులు మనోజ్, రామకృష్ణ, గణేష్, కుమార్ తదితరులతో పాటు వందమంది విద్యార్థులు పాల్గొన్నారు.
#CancelGO117 #CancelGO19and21
#SaveGovernmentSchools
#FillTeacherPosts
#StopSchoolClosures
#ImproveHostelConditions
#ControlPrivateSchoolFees
#IncreaseMessCharges
#FillHostelStaffVacancies
#EducationForAll
#ChodavaramHighSchool
#PDSOProtest #Statecall #JoinPDSO
