చోడవరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రపంచ మాదకద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పిడిఎస్ఓ ఆధ్వర్యంలో సభ జరిగింది. పిడిఎస్‌ఓ జిల్లా నాయకులు బి.కుమార్ అధ్యక్షత వహించారు.
పిడిఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. భాస్కర్ మాట్లాడుతూ, సినిమాలు, ఇంటర్నెట్, సీరియల్స్ ద్వారా డ్రగ్స్‌ను హీరోయిజంగా చూపించి యువతను చెడగొడుతున్నారని, వీటిపై నిషేధం విధించాలన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
సభలో అధ్యాపకులు రొంగళి శ్రీనివాస్, చంద్రశేఖర్, పిడిఎస్‌ఓ సభ్యులు ఎల్.గణేష్, ఎం.మనోజ్, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.