యుద్ధం ముగిసిపోతుంది

0
యుద్ధం ముగిసిపోతుంది
యుద్ధోన్మాద ప్రభువులు చేతులు కలుపుకుంటారు.
కోల్పోయిన కొడుకు కోసం
ఆ పండు ముసలి స్త్రీ
ఎదురుచూస్తూనే ఉంటుంది.
ప్రియాతిప్రియమైన సహచరుడి కోసం
ఆ నవ యువతి
ఎదురుచూస్తూనే ఉంటుంది.
వీరయోధుడైన తండ్రికోసం
ఆ అనాథ పిల్లలు
ఎదురుచూస్తూనే ఉంటారు.
మన మాతృభూమిని అమ్మేసినదెవరో
నాకు తెలియదు
కానీ
దానికి మూల్యం చెల్లించినదెవరో
నేను చూశాను!
- మహమూద్ దర్వీష్

Post a Comment

0Comments
Post a Comment (0)