పాలస్తీనాను చదవడం అంటే ప్రపంచ చరిత్రను చదవడం. మతాలను, అణచివేతను, ద్వేషాన్ని, అతి నీచపు సామ్రాజ్యవాద యుద్ధ వ్యాపారనీతిని చదవడం. పెద్ద తలలన్నీ కలిసి దశాబ్దాలుగా చేసిన విధ్వంసాన్ని, అన్యాయాల్ని చదవడం.
మనమంతా వాళ్ళ వ్యాపారంలో ఇప్పటికీ, ఎప్పటికీ సరుకులమేనని తెలియడం కోసం చదవాలి. రేపు మనవంతు వచ్చినా ప్రపంచం ఇంతే నిశ్శబ్దంగా, నిర్లజ్జగా శవాల పక్కగా నడిచిపోతుందని తెలియడం కోసం చదవాలి.
2025లో బ్రతుకుతూ అబద్ధాల్లో చావకుండా ఉండడం కోసం చదవాలి. సమస్త అన్యాయాల్ని వ్యతిరేకించే భారతీయులుగా చదవాలి. మనిషిగా బతుకుతున్నందుకు చదవాలి.
ఇన్ని అబద్ధాల మధ్యన, ఇంత విద్వేషాల మధ్యన, తెలిసిన నిజాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం ఈ కాలంలో పుట్టిన మనిషి చేయవలసిన అతి ముఖ్యమైన పని.
ఆ పని చేసిన స్టూడెంట్ (పిడిఎస్‌ఓ బులిటెన్) బాధ్యులకు ధన్యవాదాలు.
ఇది, పాలస్తీనా గురించి ఏమీ తెలీదు అనుకునేవాళ్ళు, అన్నీ తెలుసు అనుకునేవాళ్ళూ కూడా చదవాల్సిన సంచిక.
- శ్రీ వశిష్ట సోమేపల్లి
---------------------------------
చదవండి! చదివించండి!!
పాలస్తీనా సంఘీభావ 'స్టూడెంట్' ప్రత్యేక సంచిక
#Student #BulletinOfPDSO