ఇంత మంచి సంచికను రూపొందించిన 'స్టూడెంట్' నిర్వాహకులకు హృదయపూర్వక ధన్యవాదాలు - సుంకర గోపాల్

0
అవును కదూ
ఈ భూమ్మీద యుద్దం చేసే వాళ్ళని
వారి బుద్ధిని ద్వేషించాలి.
చెట్లు మొలకెత్తే చోట
బుల్లెట్లు మొలకెత్తడమా
ఊపిరిని తెంచే
ఆలోచనను ఖండించాలి
బెలూన్లు పగిలినట్టు
గుండెలు పగలుతూ ఉంటే
సాటి మనిషిగా
యుద్ధ ఊహల్ని ధ్వంసం చేయాలి
పిల్లలు
పూల మొక్కల్లాంటి పిల్లలు
మట్టి బొమ్మలాంటి పిల్లలు
రక్తమోడుతున్న కళ్ళు కలిగిన పిల్లలు
అమ్మ స్పర్శ పలకరించే పిల్లలు
దేహంలో ఇనుప గుండ్ల గాట్లకు
బలౌతున్న పిల్లలు
ఇప్పుడు గాజా
గాయపడ్డ కుందేలు పిల్ల
నిప్పుల వర్షాన్ని
గుండెల మీద భరిస్తున్న
ఆడపిల్ల
చమురు వేట కోసం
దేశాన్ని కాలిన దేహాల కమురు వాసన చేస్తున్న
సామ్రాజ్యవాద రాక్షసుడి ముఖంపై
ఉమ్మి వేయాలి
స్వేచ్ఛ కోసం
గానం చేయాలి
భూమ్మీద నుండి
యుద్ధాన్ని, యుద్ధ ఊహాని
తరిమి కొట్టాలి
యుద్ధంతో కూలిన నాగరికతలన్నీ
నేలంతా రోదిస్తున్నా
యుద్ధాన్ని ప్రేమించడం
మనిషితనం కాదు.
రాజ్యం మెదడులో యుద్ధాన్ని చెరిపేయాలి
    స్టూడెంట్ విడుదల చేసిన పాలస్తీనా సంఘీభావ సభ ప్రత్యేక సంచిక మంచి వ్యాసాలతోనూ, కవితలతోనూ చదివినవారికి గొప్ప అవగాహన కలిగిస్తూ ఉంది.
    ఇంత మంచి సంచికను రూపొందించిన 'స్టూడెంట్' నిర్వాహకులకు హృదయపూర్వక ధన్యవాదాలు
- సుంకర గోపాల్
---------------------------------
చదవండి! చదివించండి!!
పాలస్తీనా సంఘీభావ 'స్టూడెంట్' ప్రత్యేక సంచిక

Post a Comment

0Comments
Post a Comment (0)