Whoever controls the media, controls the mind.
- Jim Morrison
ప్రధాన న్యూస్ ఏజెన్సీస్, న్యూస్ ఆర్గనైజేషన్స్ మనలో ఎక్కువమంది ఆలోచనల్ని, దృక్పథాన్ని తీర్చిదిద్దుతున్నాయి.
ఉదాహరణకు గాజా పై ఇజ్రాయిల్ దాడిని ఆత్మ రక్షణ చర్యగానూ, ఉక్రెయిన్ పై రష్యా దాడిని దురాక్రమణగా చూసేలా ప్రపంచ ప్రజల్ని మభ్య పెడుతోంది. తమ వ్యాపార ప్రయోజనాలకు అడ్డు వచ్చే నాయకులపై నియంత అనే ముద్ర వేస్తోంది.
వెస్ట్రన్ మీడియా (Western Media)తో అనుబంధంగా లేకపోయినప్పటికీ మిగతా దేశాల మీడియా స్వతంత్ర ఆలోచన విధానం లేకుండా వెస్ట్రన్ మీడియా భావజాలాన్ని గుడ్డిగా అనుసరిస్తూ వస్తోంది.
మేధావుల నుండి సామాన్యుల వరకు అందరి దృక్పథాన్ని క్యాపిటలిస్టులు, ముఖ్యంగా ఆయుధ బేహార్లు చెక్కుతూ ఉంటారు. ప్రజాస్వామ్యం, దేశభక్తి లాంటి పేర్లతో వారు ప్రజలను మభ్యపెడుతూ వారి వ్యాపారానికి అనుకూలంగా మార్కెట్లను విస్తరించుకుంటూ, దేశాల్ని కూల్చుతూ తిరిగి నిర్మిస్తూ ఉంటారు.
ఉప్పెనలా పడుతున్న మానిఫ్యులేటివ్ ఇన్ఫర్మేషన్ ఇన్‌ఫ్లుయెన్స్ (Manipulative Informational Influence) నుండి తప్పించుకొని స్వతంత్రంగా సత్యాన్ని చూడగలగడం చాలా కష్టమైన పని. దానికి ఎంతో శ్రమ పెట్టాలి.
ప్రపంచవ్యాప్తంగా ఇండిపెండెంట్ మీడియా, ఇండిపెండెంట్ ఫ్రీలాన్స్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్, ఫ్రీ థింకింగ్ ఇండివిడ్యువల్స్, విజిల్ బ్లోయర్స్ (Whistle Blowers) ప్రాణాలు తెగించి సరైన సమాచారాన్ని ప్రజలకు ఇస్తున్నారు. ప్రజలు ప్రజుడీస్ (Prejudice) విడిచి చూడడమే ఈ ప్రపంచాన్ని బెటర్ వరల్డ్ (Better World)గా మార్చుకోవడానికి ఉన్న ఒకే ఒక్క అవకాశం. ఎందుకంటే ప్రజలు మారితే ప్రపంచం దానికదే మారుతుంది. ప్రజలు, ప్రపంచం వేరు కాదు కాబట్టి.
ఈ స్టూడెంట్ పత్రిక ఇంత మంచి ప్రమాణాలను కలిగి ఉంటుందని నేను ఊహించలేదు. చదివాక సంతోషం కలిగింది. ఈ పత్రికలో, ప్రస్తుత ప్రపంచ స్థితిగతులకు సంబంధించిన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో దొరకని అరుదైన సమాచారంతో కూడిన, ఎంతో శ్రమించి మానవీయ దృక్పథంతో, సత్యతతో రాసిన ఎన్నో మంచి వ్యాసాలు ఉన్నాయి.
నిజమైన నిజాయితీతో కూడిన సమాచారం కోసం ఈ పత్రికను తప్పక చదవండి.
ప్రజలే ఈ ప్రపంచాన్ని మార్చుకోవాలి. ఇంకెవరో వచ్చి మన కోసం మార్చరు. తాము నివసిస్తున్న ప్రపంచాన్ని ప్రజలు మార్చుకోవాలంటే వారికి సరైన సమాచారం అందాలి. అందుకు ఇటువంటి గుడ్ ఆస్పిరేషన్స్ (Good Aspiration) తో- శ్రద్ధగా, ప్రేమగా తీర్చిదిద్దబడిన పత్రికల పాత్ర ఎంతో ముఖ్యమైనది.
ఇంత మంచి పత్రికను రూపొందించిన ఎ.సురేష్ గారికి అభినందనలు
- శ్రీరామ్
---------------------------------
చదవండి! చదివించండి!!
పాలస్తీనా సంఘీభావ 'స్టూడెంట్' ప్రత్యేక సంచిక

