విశాఖపట్నం : నీట్ - 2024 పరీక్ష నిర్వహణలో జరిగిన స్కాంలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని, నీట్ రాసిన విద్యార్థులకు న్యాయం చేయుటకు సత్వర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (పిడిఎస్ఓ) ఆధ్వర్యంలో 22-06-2024 జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పిడిఎస్ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.సురేష్ మాట్లాడుతూ “దేశంలోని కోట్ల మంది ప్రజల ప్రాణాలు, లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఆధారపడిన వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ నిర్వహణలో జరిగిన అవకతవకలు పేపర్ లీకేజీ స్కామ్ లపై రోజుకొక కొత్త విషయం బయటపడుతోంది.పరీక్షకు ఒకరోజు ముందే ప్రశ్నా పత్రం సోషల్ మీడియాలో ఎలా లీక్ అయింది? ప్రకటించిన తేదీ (జూన్ 14) కంటే పది రోజులు ముందు (దేశ ఎన్నికల ఫలితాల రోజు) జూన్ 4వ తేదీన నీట్ ఫలితాలను ఎందుకు విడుదల చేశారు? దేశంలో 67 మంది విద్యార్థులకు 720/720 మార్కులు ఎలా వచ్చాయి? వారిలోనూ ఆరుగురు ఒకే సెంటర్ విద్యార్థులు కావడం యాదృచ్ఛికమా? ఈ ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే సమాధానం ఇవ్వాలి. బీహార్, గుజరాత్ లో జరిగిన పేపర్ లీకేజీ ఘటనలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. గత కొన్ని సంవత్సరాలుగా నీట్ పరీక్ష నిర్వహణలో పేపర్ లీకేజీలు స్కాంలు అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాను అని చెప్తున్న మోడీ, నీట్ లో జరుగుతున్న పేపర్ లీకేజీలను మాత్రం ఎందుకు ఆపలేకపోతున్నాడు? పేపర్ లీకేజీ స్కాంలలో ఇంకెంత మంది విద్యార్థులు బలైపోవాలి? దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలో జరిగిన స్కాంలను వ్యతిరేకిస్తూ నిరసనలు చేపడుతుండగా, మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటాన్ని ఖండిస్తున్నాం. కేంద్రీకరణను, కార్పొరేటీకరణను ప్రోత్సహిస్తున్న నీట్, సియుఇటి తరహా పరీక్షలను రద్దు చేయాలి. వైద్య విద్య ప్రవేశ పరీక్ష నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలి. దేశవ్యాప్తంగా విద్యార్థుల సంఖ్యకనుగుణంగా ప్రభుత్వ వైద్య కళాశాలలను వెంటనే ఏర్పాటు చేయాలి. ఈ సంవత్సరం మరియు గత కొన్ని సంవత్సరాలుగా నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలు, పేపర్ లీకేజీలు, స్కాంలపై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జ్ చేత సమగ్ర విచారణ జరిపించి నిందితులను శిక్షించాలి. తిరిగి మరలా నీట్ పరీక్షను నిర్వహించాలి, అప్పటివరకు కౌన్సిలింగ్ ను వాయిదా వేయాలి.నీట్ మరియు నెట్ పరీక్ష రాసిన విద్యార్థులకు న్యాయం చేయుటకు సత్వర చర్యలు చేపట్టాలన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పిడిఎస్ఓ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.విశ్వనాధ్, వి.లక్ష్మి, పిడిఎస్ఓ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎస్.రుద్రి మరియు నీట్ విద్యార్థులు పాల్గొన్నారు.
#NEETScam #EducationalJustice #NTA #MeritocracyFail #StudentRights #RENEET #NEETPaperLeak #JusticeForNEETStudents #ScrapNTA #Visakhapatnam #PDSO
ఆదోని : నీట్ - 2024 పరీక్ష నిర్వహణలో జరిగిన స్కాంలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని, నీట్ రాసిన విద్యార్థులకు న్యాయం చేయుటకు సత్వర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ పిడిఎస్ఓ ఆధ్వర్యంలో 24-06-2024న ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ముందు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
తిరుపతి : నీట్ - 2024 పరీక్ష నిర్వహణలో జరిగిన స్కాంలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని, నీట్ రాసిన విద్యార్థులకు న్యాయం చేయుటకు సత్వర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ పిడిఎస్ఓ ఆధ్వర్యంలో 25-06-2024న తిరుపతిలోని ఎమ్‌ఆర్ పల్లి సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పిడిఎస్ఓ తిరుపతి జిల్లా కార్యదర్శి ఆర్.ఆష, నాయకులు త్రివేణి, సుచిత్ర మరియు నీట్ విద్యార్థులు పాల్గొన్నారు.
చోడవరం: నీట్ - 2024 పరీక్ష నిర్వహణలో జరిగిన స్కాంలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని, నీట్ రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (PDSO), నవ యువ సమాఖ్య(NYS) ఆధ్వర్యంలో 26-06-2024న చోడవరం కాంప్లెక్స్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.ఓ. రాష్ట్ర అధ్యక్షులు ఎన్.భాస్కర్, పిడిఎస్ఓ జిల్లా కన్వీనర్ పి.మౌనిక, బి.రాజేష్, ఎన్.వై.ఎస్ నాయకులు కె.రామకృష్ణ, టి.అర్జున్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
అనంతపురం: నీట్ - 2024 పరీక్ష నిర్వహణలో జరిగిన స్కాంలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని, నీట్ రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (PDSO), నవ యువ సమాఖ్య (NYS) ఆధ్వర్యంలో 27-06-2024న టవర్ క్లాక్ వరకు ర్యాలీ నిర్వహించి, గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.














