భీమవరం జిల్లా తాడేపల్లిగూడెంలో గల డి.ఆర్.గోయంకా ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు పిడిఎస్ఓ ప్రచురణలైన "సామాజిక సంక్షోభపు సుడిగుండంలో విద్యారంగం, విదేశీ యూనివర్సిటీలకు అనుమతులు" అనే రెండు పుస్తకాలను ఆవిష్కరించడం జరిగింది. ఇందులో PDSO రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.సురేష్, తెలుగు అధ్యాపకులు మరియు కవి-రచయిత డా.సుంకర గోపాలయ్య, భౌతిక శాస్త్రం అధ్యాపకులు ఎం. శ్రీనివాస్, NYS రాష్ట్ర కార్యదర్శి ఎస్‌కె.భాషా, పిడిఎస్‌ఓ జిల్లా కార్యదర్శి ఎస్.మోహన్ తదితరులు పుస్తకాలను ఆవిష్కరించి విద్యార్థులకు పరిచయం చేశారు.








