తిరుపతిలో పిడిఎస్‌ఓ ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ల 93 వర్థంతి సందర్భంగా సభ

0
షహీద్ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల 93వ వర్ధంతి సందర్భంగా PDSO ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ లో సభను నిర్వహించడం జరిగింది. ఈ సభకు పిడియస్ఓ తిరుపతి కార్యదర్శి ఆర్. ఆష అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమంలో వక్తలు ఎస్వీ యూనివర్సిటీ ఆర్కియాలజీ, డా॥ డి. గోవిందులు మాట్లాడుతూ భగత్ సింగ్ రాజకీయ జీవితం ఏడేళ్లే అయినా ఈ దేశం కోసం ఆయన చేసిన కృషి, త్యాగం చిరస్మరణీయం అన్నారు. ఆనాడు దేశ సహజ సంపదలని బ్రిటిష్ వాడు ఒక్కడే కొల్లగొట్టుకుని పోతే, ఈనాడు అనేక సామ్రాజ్యవాద దేశాలు కొల్లగొడుతున్నాయి. దేశంలో విద్యా, వైద్యం ఖరీదైన సరుకుగా మారిపోయాయి. నిరుద్యోగం తీవ్రమవుతోంది. విద్యార్థుల, నిరుద్యోగుల, రైతుల ఆత్మహత్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పట్టణాలలో కార్మికులు చాలీచాలని జీతాలతో దుర్భరమైన జీవితాలను అనుభవిస్తున్నారు. పేదవారు మరింత పేదవారు అవుతుంటే ధనికులు కుబేరులౌతున్నారు. మన పాలకులు అనుసరిస్తున్న ప్రైవేటు, కార్పొరేటు మరియు సామ్రాజ్యవాద అనుకూల విధానాల ఫలితంగానే మనకీ పరిస్థితులన్నీ దాపురించాయి. భగత్ సింగ్ కలలుగన్న సోషలిస్టు వ్యవస్థ ఈనాటికి పరిపూర్తి చేయాల్సిన కర్తవ్యం నేటి విద్యార్థి,యువత మీద ఉందన్నారు.
ఎస్వీ యూనివర్సిటీ మ్యాథమెటిక్స్ ప్రొ. సుధాకరయ్య మాట్లాడుతూ నాడు బ్రిటిష్ వాడి దోపిడీ పీడనలకు, అణిచివేతకు వ్యతిరేకంగా భగత్ సింగ్ మరియు అతని సహచరులు సలిపిన పోరాటాలు బ్రిటిష్ వాడిని బెంబేలెత్తించాయి అన్నారు. నాడు ఎందరో విద్యార్థి నాయకులు సలిపిన పోరాటాలు, విజయాలు చిరస్మరణీయం. విద్యార్థి దశలో ఉన్నప్పుడు నేను నా సహచరులంతా ఒక సంఘంగా ఏర్పడి హాస్టల్, కాలేజీ సమస్యలకి వ్యతిరేకంగా పోరాడి ఎన్నో విజయాలను సాధించుకున్నాము. ఈనాడు విద్యారంగంలో అనేక సమస్యలు విద్యార్థులని వెంటాడుతున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికై విద్యార్థులంతా ఏకమయ్యి ప్రభుత్వాలని ప్రశ్నించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)