రూప శ్రీ మృతిపై సమగ్ర విచారణ జరిపి, కారకులను కఠినంగా శిక్షించాలి!

0
    కొమ్మాది చైతన్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని రూప శ్రీ మృతి పై సమగ్ర విచారణ జరిపి, కారకులను కఠినంగా శిక్షించాలని కళాశాల వద్ద పిడిఎస్ఓ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించడం జరిగింది.
    ఈ కార్యక్రమంలో పిడిఎస్ఓ జిల్లా అధ్యక్షుడు పి. విశ్వనాధ్ మాట్లాడుతూ "మధురవాడ సమీపంలోని కొమ్మాది చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్యాకల్టీ మరియు విద్యార్థుల లైంగిక వేధింపులకు తాళలేక డిప్లమో ఫస్ట్ ఇయర్ విద్యార్థి రూప శ్రీ (16) గురువారం రాత్రి ఒంటిగంటకు హాస్టల్ 4వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు తన నాన్నకు మెసేజ్ పెడుతూ "నేను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఈ కళాశాలలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. ఫ్యాకల్టీకి చెప్పొచ్చు కదా.. అని మీరు అనొచ్చు. కానీ వారే దానికి పాల్పడుతుంటే ఇంకెవరికి చెప్పలగం. చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. నేనే కాక కళాశాలలో చాలామంది విద్యార్థినులు లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు. ఎవరికి చెప్పుకోలేక, కాలేజీకి వెళ్లలేక నలిగిపోతున్నాం. పోలీసులకు చెబితే సోషల్ మీడియాలో అసభ్యకరమైన ఫొటోలు పెడతామంటూ బెదిరిస్తున్నారు. ఎవరో ఒకరు చనిపోతే కానీ బయట ప్రపంచానికి ఈ కీచకుల గురించి తెలియదు. ఆ పని నేనే చేస్తున్నాను.. నాన్నా నీకు ఒక మంచి కుమార్తెను కాలేకపోయినందుకు క్షమించు..." తన ఆవేదనను వెల్లడించింది. వారి తల్లిదండ్రులు తెలుపుతున్న సమాచారం మేరకు కళాశాల యాజమాన్యం మరియు పోలీసులు చెబుతున్న విషయాల్లో వాస్తవం కనిపించడం లేదు. కనుక న్యాయబద్ధంగా విచారణ జరిపి నిజా నిజాలను నిష్పక్షపాతంగా వెల్లడించాలి " అన్నారు.
    పిడిఎస్ఓ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎస్.రుద్రి మాట్లాడుతూ "తక్షణమే లైంగిక వేధింపులకు కారణమైన ఫ్యాకాల్టీని శిక్షించాలి. కళాశాలలో లైంగిక వేధింపులను అరికట్టి, లైంగిక వేధింపులకు గురవుతున్న చైతన్య కళాశాల విద్యార్ధినులు అందరికీ రక్షణ కల్పించాలి. కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి. రూపశ్రీ కుటుంబానికి న్యాయం చేయాలని పిడిఎస్ఓ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం" అన్నారు.
    కేజీహెచ్ వద్ద పిడిఎస్ఓ రాష్ట్ర కోశాధికారి ఎల్.భాను, పిడిఎస్ఓ జిల్లా కార్యదర్శి వి.లక్ష్మి రూప శ్రీ కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడుతూ "రూప శ్రీ మృతదేహాన్ని పోస్టుమార్టం చేయడంలో జాప్యం చేస్తున్నారని, ఆమె మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని, సమగ్ర విచారణ జరపడంలో పోలీసులు, కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తున్నారని, న్యాయబద్ధంగా విచారణ జరిపి రూప శ్రీ కి ఆమె కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసారు. అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్మన్ కు మెమొరండం అందించగా, రూప శ్రీ మృతికి న్యాయం జరిగేలా చూస్తామని వారు హామీ ఇచ్చారు.
విప్లవాభినందనలతో…
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(PDSO),
విశాఖపట్నం






Tags

Post a Comment

0Comments
Post a Comment (0)