ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ప్రగతిశీల, వామపక్ష భావజాలం కల్గిన విద్యార్థులపై ఏబీవీపీ మరోసారి దాడి

0
    ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఫిబ్రవరి 29వ తేదీ రాత్రి ప్రగతిశీల, వామపక్ష భావజాలం కల్గిన విద్యార్థులపై ఏబీవీపీ మరోసారి దాడి చేసింది. జెఎన్‌యులో విద్యార్థుల ఎన్నికల అంశంపై 'జనరల్ బాడీ మీటింగ్' జరిగింది. ఈ మీటింగ్ లో జెఎన్‌యు ఎస్‌యు జాయింట్ సెక్రటరీ డానిష్ ని ఎబివిపి గూండాలు బంధించగా, వారిని విడిపించేందుకు వెళ్ళిన కలెక్టివ్ మరియు ఇతర విద్యార్థులపై ఎబివిపి గూండాలు కర్రలతో దాడి చేశారు. వారిపైకి సైకిళ్లు విసిరి గాయపరిచారు. డ్రమ్‌తో ఒకరి తల పగలగొట్టారు. గాయపడిన వాళ్ళలో కలెక్టివ్ కు చెందిన శౌర్య, ప్రియం పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.
    త్వరలో జెఎన్‌యు లో జరిగే విద్యార్థి సంఘ ఎన్నికలను ఆపాలని ఏబీవీపీ శతవిధాల ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే నిన్న రాత్రి దాడి జరిగింది. ఈ రకమైన దాడి తొలిసారి కాదు. గత నెల ఫిబ్రవరి 9 తేదీన, ఇంకా అనేక పర్యాయాలు ఎబివిపి గూండాలు ఇటువంటి దాడులకు,హింసకు పాల్పడ్డారు. ఇటీవల కాలంలో బిజెపి ప్రభుత్వం అండతో విద్యా సంస్థలలో మతోన్మాద పూరిత దాడులు పెరుగుతున్నాయి. వీటిని విద్యార్థి లోకం తీవ్రంగా ఖండించాలి. తమ హక్కుల కోసం ధైర్యంగా పోరాడాలి.
• జెఎన్‌యులో కలెక్టివ్ విద్యార్థి సంఘ నాయకులైన శౌర్య, ప్రియమ్‌లపై ఎబివిపి గూండాలు జరిపిన దాడిని ఖండించండి!
• జెఎన్‌యులో విద్యార్థి సంఘ ఎన్నికలు జరగకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్న ఎబివిపి చర్యలను వ్యతిరేకించండి!
• విశ్వవిద్యాలయాల్లో భావప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామిక వాతావరణంకై పోరాడుదాం!
విప్లవాభినందనలతో...
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(PDSO),
ఆంధ్రప్రదేశ్
తేదీ : 01-03-2024, విజయవాడ
• Condemn the attack by ABVP goons on Collective Comrades Sourya and Priyam in JNU
• Resist Against ABVP - Admin Attempt to Stop JNUSU Elections
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)