పిడిఎస్ఓ రాయలసీమ కన్వీనర్ పేరుతో వ్యవహరిస్తోన్న కత్తి ఓబులేసు కి, మా సంస్థకు ఎటువంటి సంబంధం లేదు

0
    ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(PDSO) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగ సమస్యలపై గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నది. ఇందులో భాగంగా విద్యా,ఉపాధి రంగాల సమస్యలపై PDSO, NYS రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో గుంటూరులో రాష్ట్ర సదస్సును డిసెంబర్ 22 తేదీన నిర్వహిస్తున్నాం. ఇంతలో విద్యార్థులను, ప్రజలను గందరగోళపరిచే విధంగా పిడిఎస్ఓ సంస్థ పేరుతో ఒక కరపత్రం మా రాష్ట్ర కమిటీ దృష్టిలోకి వచ్చింది. డిసెంబర్ 16,17 తేదీల్లో పిడిఎస్ఓ ఆధ్వర్యంలో విజయవాడలో (కరపత్రం చివరలో గుంటూరు సదస్సు జరుపుతున్నట్టు ఆ కరపత్రంలో ఉంది. సదస్సు నిర్వాహకుడిగా, రాయలసీమ జిల్లాల కన్వీనర్ గా కత్తి ఓబులేసు పేరు ఉంది. కడప జిల్లా ప్రొద్దటూరుకు చెందిన ఓబులేసు రాయలసీమ జిల్లాల్లో పిడిఎస్ఓ సంస్థ పేరుని ఉపయోగించి విద్యా సంస్థల యాజమాన్యాలు, వ్యాపారస్తుల దగ్గర నుండి డబ్బు వసూలు చేస్తూ ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నట్టు, ఇదివరకే కడప జిల్లాలో ప్రొద్దుటూరులో కూడా సంస్థ పేరుతో పలు అక్రమాలకు పాల్పడినట్టు తెలిసింది. కత్తి ఓబులేసు పిడిఎస్ఓ సంస్థ పేరుతో చేపట్టే కార్యక్రమాలకు, చర్యలకు, మా సంస్థకు ఎటువంటి సంబంధం లేదని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (PDSO) రాష్ట్ర కమిటీగా విద్యార్థులకు, ప్రజలకు, మేధావులకు, విద్యా సంస్థల యాజమాన్యాలకు స్పష్టపరుస్తున్నాం.
    విప్లవ, ప్రగతిశీల, అభ్యుదయ సంస్థల పేర్లను దుర్వినియోగపరుస్తూ, అక్రమాలకు పాల్పడుతున్న కత్తి ఓబులేసు లాంటి వ్యక్తులను విద్యార్థులు, ప్రజలు, మేధావులు ప్రశ్నించి నిలదీయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (PDSO),
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ
ఎన్.భాస్కర్,
రాష్ట్ర అధ్యక్షుడు
ఎ.సురేష్,
రాష్ట్ర ప్రధానకార్యదర్శి
తేదీ : 12-12-2023,
విజయవాడ
- పిడిఎస్ఓ రాష్ట్ర కమిటీ ప్రకటన



Tags

Post a Comment

0Comments
Post a Comment (0)