1959 నుంచి 1975 ఏప్రిల్ 30 వ తేదీ వరకు జరిగిన వియత్నాం యుద్ధం ప్రపంచ బడుగు ప్రజల మహత్తర విజయ చరిత్రగా నిలిచిపోయింది. 1969 సెప్టెంబర్ 3 వ తేదీన హోచిమిన్ తుదిశ్వాస విడిచేనాటికి వియత్నాం అమెరికా సైన్యంతో హోరాహోరీ యుద్ధంలో మునిగి ఉంది. అమెరికన్ సామ్రాజ్యవాదంపై అంతిమ విజయం తథ్యం అనే సంపూర్ణ విశ్వాసంతో ఈ కింది కవిత లోని పంక్తుల్ని పలుకుతూ హోచిమిన్ కన్నుమూశాడు.

