నాకిప్పుడు....
నువ్వు కాటేసిన నా వాళ్లు కావాలి
నువ్వు కాల్చేసిన నా ఒళ్ళు కావాలి
నువ్వు కూల్చేసిన నా ఇళ్ళు కావాలి
నువ్వు పెరికేసిన నా కళ్ళు కావాలి
మొత్తంగా నాకు నా బతుకు కావాలి
దేబిరించి అడుక్కునేదేమిలేదు
బరిగీసి నిలబడ్డవాణ్ణి
ఆడినా ! ఓడినా !పోరాడినా!
గుండె కొలిమిలో సమరనాదమై
రగులుతున్న వాణ్ణి
రా!రా!రా!
నిన్ను సరైన కొలతలతో సమాధి చేసేందుకు నా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు నీకు శాశ్వతంగా సమరగీతం పాడేందుకు నేనూ నా వాళ్ళు పొలిమేరలు దాటి
ఊరి నడిబొడ్డుకు నడుచుకుంటూ
ఊరేగించి వస్తున్నారు !

