మేడే వర్థిల్లాలి!

0
నూతన యుగారంభ సంకేతం "మేడే"
~~~~
ఆధునిక మానవ చరిత్రలో
పెట్టుబడిదారీ దోపిడీ అణచివేతలకు వ్యతిరేకంగా,
శ్రమించే రెక్కలు తప్ప వ్యక్తిగత ఆస్తులు లేని
కార్మిక వర్గం సంఘటితమై ఎలుగెత్తి పోరాడిన రోజు
1886 మే 1వ తేదీ ... మేడే!!
ఆనాటి దోపిడీ అణచివేతల్లో బీభత్సముంది
బిగించిన పిడికిళ్ళలో,
నినదించిన కంఠధ్వనులలో,
చిందించిన రక్తంలో సౌందర్యముంది.
అది సుందర సమతా సమాజంవైపు
సంఘటితంగా వేసిన అడుగు మాత్రమే కాదు
కారణం -
అది వొక అద్భుతమైన మలుపు!
ప్రకృతి బీభత్సాన్ని సౌందర్యవంతంగావించే
శ్రమ జీవుల చిహ్నమైన సుత్తీ, కొడవలీ..
త్యాగాల పోరాటాల సంకేతమైన
ఎర్రజెండాలో హత్తుకుని పుట్టిన రోజు.... మేడే!
ప్రపంచ చరిత్రలో తొలిసారిగా
శ్రామికుల చిహ్నం జెండాగా జన్మించిన
సుందర దినం మేడే!
సామాజిక బీభత్సాల్ని ధ్వంసం చేసి
జీవన సౌందర్యాలను ఆవిష్కరించటానికి
దీక్ష చేబూనే రోజు - మేడే!!
వ్యక్తిగత ఆస్తుల పెట్టుబడిదారీ యుగానికి
కాలం చెల్లిందని
నిర్భయంగా ఎలుగెత్తి చాటే రోజు మేడే!
ఒక మనిషిని మరొక మనిషీ,
ఒక జాతిని వేరొక జాతీ
పీడించే సాంఘిక ధర్మాల అంతానికి,
నూతన యుగారంభానికి
సంకేతంగా నిలిచే రోజు - మేడే!
దోపిడీ బీభత్సాల పునాదులపై నిలిచిన
పెట్టుబడిదారీ యుగానికి
కాలం చెల్లిందని ప్రకటించిన “సత్యం” మేడే !
సమస్త మానవ బీభత్సాల కేంద్రకమైన సామ్రాజ్యవాదాన్ని
తుత్తునియలుగావించే అర్ధవంతమైన
కార్యాచరణకు స్ఫూర్తి ప్రదాత మేడే!
మేడే అంటేనే నూతన యుగావిష్కరణకై
అలుపెరుగని ఆశావహమైన ఆర్తి!
అది నిరంతరాయ విప్లవసౌందర్య స్ఫూర్తి !!
ఆధారం:
దివికుమార్ వ్రాసిన "బీభత్సం - సౌందర్యం" అనే కవితలోని కొంత భాగం.
ప్రజాసాహితి, 2003(జూన్)

Post a Comment

0Comments
Post a Comment (0)