భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ల 92వ వర్థంతి సందర్భంగా కార్యక్రమాలు

0

ఏలూరులో భగత్ సింగ్ వర్థంతి సభ:
భగత్ సింగ్ వారసత్వాన్ని యువత అందిపుచ్చుకోవాలి!
~~
PDSO - NYS ఉమ్మడి ప౹౹ గోదావరి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో భగత్ సింగ్ 92వ వర్థంతి సభ కొత్త బస్టాండ్ ప్రక్కన గల అల్లూరు సత్యనారాయణ భవనంలో పిడిఎస్ఓ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్.మోహన్ అధ్యక్షతన జరిగింది.
ఈ సభకు ముఖ్య అతిథిగా అసోసియేట్ ప్రొఫెసర్ డా.జి.శ్రీనివాస్ మాట్లాడుతూ "నాణ్యతతో కూడిన చదువులు ప్రజలందరికీ అందుబాటులో లేని కారణంగా పేద ప్రజలు వారి విద్యకు దూరమవుతున్నారు. అలాగే మాతృభాషా మాధ్యమంలో చదువులు సాగినపుడు మాత్రమే విద్యార్థులకు సృజనాత్మకతో కూడిన విద్య అందుతుందన్నారు. విద్యారంగంలో సమస్యల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉంది.భగత్ సింగ్ రాజకీయ జీవితం ఏడేళ్ళే అయినా ఆనాటి స్వాతంత్రోద్యమంలోను తను పోషించిన పాత్ర చాలా విలువైనది. స్వాతంత్ర్యోద్యమం, నాస్తికత్వం, మతం, కుల సమస్యల పైనా భగత్ సింగ్ రాసిన రచనలు నేటి యువత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(PDSO) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.సురేష్ మాట్లాడుతూ "చదువుల పేరుతో పాఠశాల, కళాశాల యాజమాన్యాలు పెట్టే ఒత్తిడికి తట్టుకోలేక ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పాఠశాల విద్యార్థులు మొదలుకొని మెడిసిన్, ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా చనిపోతున్నారు. నేషనల్ క్రైమ్ బ్యూరో నివేదికల ప్రకారం దేశంలో జరుగుతున్న ఆత్మహత్యల్లో 8% విద్యార్థులవే. వాటిలోనూ 50 శాతం 18 ఏళ్లలోపు వారే ఉంటున్నా, రోజుకు 36 మంది విద్యార్థులు ఆత్మహత్యలు పాల్పడుతున్నారని నివేదికలు చెపుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకుండా మౌనం వహించడం దుర్మార్గం. విద్యార్థుల ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
నవ యువ సమాఖ్య (NYS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కె.భాషా గారు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటు, కార్పోరేట్ శక్తులకు అప్పగిస్తూ నిరుద్యోగ సైన్యాన్ని పెంచి పోషిస్తున్నారనీ, మరోవైపు కుల, మత ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ విద్యార్థి, యువతను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల 30 వేల పోస్టులను, కేంద్రంలో ఉన్న 60 లక్షల పోస్టులను కేంద్ర, రాష్ట్ర పాలకులు భర్తీ చేయాలనీ డిమాండ్ చేశారు. ఆనాడు దేశ స్వాతంత్ర్యం కోసం,విముక్తి కోసం భగత్ సింగ్ యిచ్చిన 'సామ్రాజ్యవాదం నశించాలి!', 'ఇంక్విలాబ్ జిందాబాద్' నినాదాల స్ఫూర్తిని నేటి యువత అందిపుచ్చుకోవాలన్నారు.
ఉమ్మడి ప౹౹గో౹౹ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 150 మంది విద్యార్థులు, యువకులు సభలో పాల్గొన్నారు. సభకు ముందు వసంత మహల్ నుండి జూట్ మిల్లు, ఫైర్ స్టేషన్ మీదుగా కొత్త బస్టాండ్ వరకు భగత్ సింగ్ కు జోహార్లు చెపుతూ ర్యాలీ, ప్రదర్శన నిర్వహించారు.
విప్లవాభినందనలతో...
పిడిఎస్ఓ - ఎన్.వై.యస్
ఉమ్మడి ప౹౹గో౹౹ జిల్లా కమిటీలు





అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో PDSO ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ల 92వ వర్థంతి సభ



వెంకటగిరిలో స్త్రీ విముక్తి సంఘటన, PDSO, NYS ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ల 92వ వర్థంతి సభ


విజయనగరంలో PDSO ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ల 92వ వర్థంతి సభ


నెల్లూరులో PDSO-NYS ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ల 92వ వర్థంతి సభ



ఆదోనిలో PDSO ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ల 92వ వర్థంతి సభ

అనంతపురంలో NYS,PDSO ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ల 92వ వర్థంతి సభ


తిరుపతిలో PDSO ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ల 92వ వర్థంతి సభ

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)