ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(PDSO) ఆదోని డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మిగనూర్ సర్కిల్ నుండి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు హాస్టల్ విద్యార్థులతో ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పిడిఎస్ఓ జిల్లా కన్వీనర్ కె.తిరుమలేష్ మాట్లాడుతూ 'హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం, శుభ్రతతో కూడిన త్రాగునీరు, మరుగుదొడ్లు, దోమతెరలు, రగ్గులు, దుప్పట్లు వంటి సదుపాయాలు కల్పించాలనీ, హాస్టళ్లలోని విద్యార్థులకు సరిపడా గదులతో కొత్త భవనాలు ఏర్పాటు చేయాలనీ, అద్దె భవనాల్లో నడుస్తున్న హాస్టళ్ళకు తక్షణమే శాశ్వత భవనాలు నిర్మించాలనీ, పెండింగ్లో ఉన్న మెస్, కాస్మోటిక్ ఛార్జీల బకాయిలను వెంటనే చెల్లించాలనీ, అన్ని విడతల విద్యా, వసతి దీవెనలను వెంటనే విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ తేజ, డివిజన్ అధ్యక్షుడు ఖాదర్, డివిజన్ కార్యదర్శి సురేష్, డివిజన్ నాయకులు మేఘన, అర్చన తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ విద్యార్థుల సమస్యలపై ఆదోనిలో సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు PDSO ధర్నా
January 07, 2023
0
Tags



