ఉన్నత విద్య చైర్మన్ హేమచంద్రారెడ్డిని విధులు నుండి తొలగించాలి!

0
ఆదోనిలో ఎమ్మిగనూరు సర్కిల్ నందు ఆంధ్రప్రదేశ్ లోని ఉన్నత విద్యలో జరుగుతున్న నిర్లక్ష్యం గురించి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (PDSO), డెమొక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (DSF) ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.
ఈ విద్యా సం౹౹లో సరైన సమయంలో అడ్మిషన్లు నిర్వహించకుండా విద్యా సంవత్సరం వృధా చేస్తూ విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్న, విద్యార్థులకు వస్తున్న ఉపకార వేతనాలను సకాలంలో అందటం లేదనీ, రాష్ట్ర వ్యాప్తంగా సరైన సమయంలో డిగ్రీ, పీజీ, బీఈడీ, లా, వివిధ ఉన్నత విద్యా కోర్సులకు అడ్మిషన్లు నిర్వహించక విద్యాసంవత్సరం వృధా చేస్తున్న ఉన్నత విద్య చైర్మన్ హేమచంద్రా రెడ్డిని పదవి నుండి తొలగించాలనీ, విద్యా వ్యవస్థలో మార్పుల పేరిట అనేక మంది విద్యార్థులను విద్యకు దూరం చేయటంలో భాగంగా తీసుకువచ్చిన జీవో నెంబర్ 77 రద్దు చేయాలనీ PDSO జిల్లా కన్వీనర్ కె.తిరుమలేష్, DSF రాష్ట్ర నాయకులు మల్లికార్జున డిమాండ్ చేశారు. ఇంకా ఈ ధర్నాలో DSF జిల్లా అధ్యక్షులు రాజు, PDSO డివిజన్ కార్యదర్శి సురేష్, అధ్యక్షుడు ఖాదర్ భాషా తదితరులు పాల్గొన్నారు

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)