విద్యార్థులకు సరైన సమయానికి బస్సు నడపాలి

0
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ( PDSO) డిమాండ్
ఆదోని : అన్వల్ గ్రామం నుండి ఆదోని కు వచ్చే బస్సు విద్యార్థులకు సరైన సమయానికి రాకపోవడం వలన విద్యార్థులు కళాశాలలకు తగిన సమయంలో హాజరు కాలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదోని బస్ డిపో దగ్గర ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ( PDSO) ఆదోని డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. అనంతరం డిపో మేనేజర్ రాఘవేంద్ర గారికి వినతిపత్రం యిచ్చి, సమస్యను వివరించగా విద్యార్థులకు అనుకూలంగా సరైన సమయానికి బస్సు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఆందోళన కార్యక్రమానికి డివిజన్ కార్యదర్శి సురేష్, అధ్యక్షుడు ఖాదర్ బాషా నాయకత్వం వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పిడిఎస్ఓ నాయకులు ఇస్మాయిల్, మంజు, నాసిర్ తదితరులు పాల్గొన్నారు
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)