బి.సూర్యసాగర్

0
జాతీయోద్యమం భారతదేశం (ఉపఖండం) యొక్క రాజకీయ ఏకీకరణకు దారితీసిందన్నది వాస్తవం. జాతీయోద్యమానికి కారణం నేరమయమైన, క్రూరమైన బ్రిటిష్ వలస పాలన. భారతదేశంపై దాని ఫలితాలెక్కడ? ఉపఖండ స్థాయిలో వలస పాలనను ధిక్కరించి ప్రజలెందుకు స్వాతంత్య్రాన్ని కోరుకున్నారు. ఆ స్వాతంత్య్ర మనబడేది ఎట్లా సాధించుకున్నారు. ఆ సాధనలో ప్రజల పోరాట పటిమ, ఆకాంక్షలు ఎలాంటివి? ఏ ఏ సెక్షన్లు ఆ ఉద్యమంలో ఎలా వ్యవహరించాయి? ఏఏ లక్ష్యాలతో వ్యవహరించాయి? చివరికి స్వతంత్ర రాజ్యాధికారం ఎవరికి దక్కింది? 75 ఏళ్ల అమృతోత్సవం నాటికి ఆ స్వాతంత్య్ర ఫలాల స్వరూప స్వభావాలెలా ఉన్నాయి? చదువరి అయిన, బాధ్యతాయుతమైన ప్రతి పౌరుడు ఈ ప్రశ్నలు వేసుకొని నిజాయితీగా సమాధానాలు వెతికి ప్రజలకు వివరించి విజ్ఞానవంతుల్ని, చైతన్యవంతుల్ని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తద్వారా ఉజ్వల భారత సమాజ నిర్మాణం కోసం కర్తవ్యాల్ని, కార్యక్రమాలను ఎంచుకొని ఆచరించ గలుగుతాం. PDSO-NYS విద్యార్ధి, యువజన సంస్థలు ప్రచురించిన ఈ పుస్తకం ఆ దిశలో ఒక మంచి ప్రయత్నం.
పేజీలు: 80
వెల: 75/-
పుస్తకాల కొరకు : 9701924714
చదవండి! చదివించండి!!

Post a Comment

0Comments
Post a Comment (0)