"భారత జాతీయోద్యమం - మహోజ్వల వారసత్వం" - పుస్తక ఆవిష్కరణ సభ

0

★ PDSO - NYS ప్రచురించిన "భారత జాతీయోద్యమం - మహోజ్వల వారసత్వం" పుస్తక ఆవిష్కరణ సభ శిఖామణి సెంటర్ సమీపంలోని శిఖర స్కూల్ వద్ద జరిగింది. ఈ సభకు PDSO రాష్ట్ర అధ్యక్షుడు N. భాస్కర్ అధ్యక్షత వహించారు.

ప్రజాసాహితి ప్రధాన సంపాదకులు కొత్తపల్లి రవిబాబు గారు పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ "స్వాతంత్య్రం వచ్చి 75 సం,, పూర్తి అయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో సంబరాలు జరిపారు, మరోవైపు జాతీయోద్యమ చరిత్రను వక్రీకరిస్తూ పాఠ్యాంశాలలో చొప్పిస్తున్నారు మరియు సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్ గా జాతీయ జెండా ను పెట్టుకోవడమే దేశభక్తిగా ప్రచారం చేస్తున్నారు. కానీ బ్రిటిష్ వలసవాద పాలనకు వ్యతిరేకంగా రైతులు, గిరిజనులు, కార్మికులు, మహిళలు, విద్యార్థులు, యువత ప్రాణాలొడ్డి పోరాడారు. వారి త్యాగాల స్ఫూర్తితో నేటి యువతరం పోరాడాలని ఉద్దేశంతో PDSO-NYS ప్రచురించిన ఈ పుస్తకం అందరూ తప్పక చదవాల్సిన అవసరం ఉందన్నారు.
★ OPDR రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుస్తక పరిచయ కర్త వి.హనుమంతు రావు గారు మాట్లాడుతూ "బ్రిటిష్ పాలకుల దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా రైతులు, గిరిజనులు, కార్మికులు, మహిళలు, విద్యార్థులు, యువత సమిష్టిగా అశేష త్యాగాలతో చేపట్టిన ఉద్యమాల వివరాలతో మరియు సంపూర్ణ స్వాతంత్ర్యమే ఆశయంగా వారు చేపట్టిన ఈ ఉద్యమాల లక్ష్యాలు సాధింపబడ్డాయా?! నేడు విదేశీ కంపెనీలు దేశాన్ని దోచుకుంటున్న పరిస్థితులు ఈ పుస్తకంలో చక్కగా వివరించ బడ్డాయన్నారు.
★ PDSO రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. సురేష్ మాట్లాడుతూ "స్వాతంత్ర్య పూర్వం ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక్కటే దేశాన్ని దోచుకున్నది, నేడు అనేక విదేశీ కంపెనీలు దేశాన్ని అడుగడుగు దోచుకుంటున్నాయి, ఇటువంటి పరిస్థితులలో దోపిడీ, అణిచివేతలకు వ్యతిరేకంగా సమరశీలంగా పోరాడిన వివిధ సమూహాలు జరిపిన మహత్తర పోరాటాల స్ఫూర్తితో నేడు సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా విద్యార్థి, యువతరం పోరాటాలు నిర్మించాలని దానిలో భాగంగానే నాడు అన్ని వర్గాల ప్రజలు సమిష్టిగా సాగించిన పోరాటాల చరిత్రను నేటి ఉద్యమ ఆవశ్యకతను తెలియజేస్తూ "భారత జాతీయోద్యమం- మహోజ్వల వారసత్వం" పుస్తకాన్ని తీసుకొచ్చామన్నారు.
★ ఈ కార్యక్రమంలో NYS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Sk. భాష గారు, APTF మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండురంగవర ప్రసాద్ గారు, జనసాహితి రాష్ట్ర అధ్యక్షులు దివికుమార్ గారు ప్రసంగించారు.
★ ఈ సభలో విద్యార్థి కళాకారులు ప్రజాగేయాలు ఆలపించారు. విద్యార్థులు, యువకులు, ప్రజాతంత్రవాదులు పాల్గొన్నారు.
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)