PDSO , NYS విద్యార్థి యువజన సంఘాలు ప్రచురించిన "భారత జాతీయోద్యమం - మహోజ్వల వారసత్వం" అనే పుస్తక పరిచయ సభ శ్రీకాళహస్తిలోని సరస్వతి బాయి హైస్కూలులో జరిగింది.
ఈ సభకు అధ్యక్షత వహించిన పిడిఎస్ఓ తిరుపతి జిల్లా అధ్యక్షుడు ఎస్.కె.రెహమాన్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిందని మన పాలకులు చెబుతున్నప్పటికీ, రోజు రోజుకి దేశంలో అనేక సమస్యలు, అసమానత్వాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు అన్నారు.
పిడిఎస్ఓ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆర్. ఆష మాట్లాడుతూ దోపిడీ వర్గాల దీర్ఘకాల ప్రయోజనాలు చేకూర్చడం కోసం గాంధీ శాంతియుత, అహింసా పద్ధతుల పేరుతో ప్రజలు చేస్తున్నటువంటి ఉద్యమాలని సంస్కరణవాద ఊబిలోకి నెట్టి పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు. నేడు అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం చరిత్రను వక్రీకరించి విద్యార్థుల్ని, యువకుల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది అన్నారు.
సామాజికశాస్త్ర ఉపాధ్యాయులు వెంకటేశ్వర్ల రెడ్డి మాట్లాడుతూ బ్రిటిష్ వాడు భారతదేశానికి వ్యాపారం కోసం అని వచ్చి ఈస్టిండియా కంపెనీ పేరుతో దాదాపు 200 సంవత్సరాలకు పైగా సంపాదనంతా కొల్లగొట్టుకుపోయాడు, నేడు అనేక బహుళజాతి కంపెనీలు భారతదేశాన్ని కొల్లగొడుతున్నాయి అన్నారు.
ఈ కార్యక్రమంలో పిడిఎఓ నాయకులు హేమంత్, మురళి, హరీష్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు మరియు ఎస్ఎస్ బి హైస్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.


