"బడిలో టీచర్లకు, పిల్లలకు ఉండే సంబంధం సైనిక దళంలో ఉన్నట్లే ఉంటుంది. రెండూ వ్యవస్థలలో ఒకటే ధ్యేయం - క్రమశిక్షణ, విధేయత. ఇవి మానవ సంబంధాలను నిరోధిస్తాయి. మర్యాద అంటే భయం మినహ మరేమి కాదు. టీచరు అంటే భయపడే పిల్లలు ఆ టీచరు బోధించే సబ్జెక్టు అంటే కూడా భయపడతారు. పిల్లలను అధ్యయనం చేయటం టీచర్ల ప్రధాన లక్ష్యంగా ఉండాలి. తరగతి గదిలో, ఆటల సమయంలో పిల్లల ప్రవర్తన అధ్యయనం చేయాలి. బడిలో చిత్రలేఖనం, సంగీతం, నృత్యం, చేతివృత్తులు నిరంతరం కొనసాగాలి. టీచర్లు పిల్లలతో పాటు కలసి పనిచేయాలి. వారితో కలసి నేర్చుకోవాలి."


