అనకాపల్లిలోని ఎ.ఎమ్.ఎ.ఎల్ కాలేజీలో "భారత జాతీయోద్యమం - మహోజ్వల వారసత్వం" పుస్తక ఆవిష్కరణ సభ

0
భారత జాతీయోద్యమం - మహోజ్వల వారసత్వం అనే పుస్తకం ఆవిష్కరణ సభ అనకాపల్లిలోని ఎ.ఎమ్.ఎ.ఎల్ కాలేజీలో జరిగింది.
ఈ సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర అధ్యక్షులు ఎన్.భాస్కర్ మాట్లాడుతూ దేశభక్తి అంటే వాట్సప్ స్టేటస్ లు పెట్టడం, జండాలు ఎగరేయడం మాత్రమే కాదని సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు వెతకడం, అందరికీ విద్య, వైద్యం, ఉపాధి కూడు, గుడ్డ, నివాసం అందాలని అటువంటి సమాజం కోసం విద్యార్థి, యువకులు పోరాడాలని అన్నారు. ముందుగా జాతీయోద్యమంలో పాల్గొని ప్రాణాలర్పించిన అమరులకి మౌనం పాటించారు.
ఎ.ఎమ్.ఎ.ఎల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా. జి.జయబాబు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ భారత జాతీయోద్యమంలో ఎందరో మహానుభావులు తమ మాన, ప్రాణ, ధనాలను అర్పించి బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా పోరాడారని అన్నారు. ఈ పుస్తకంలో బ్రిటిష్ వాడు భారతదేశంలోకి అడుగు పెట్టినప్పటి నుండి 1947 వరకు జరిగిన చరిత్రను, అలాగే కార్మికులు, రైతులు, మహిళలు, విద్యార్థి, యువకులు ఎలా పాల్గొన్నారో రాశారని ఇది ప్రతి ఒక్కరూ చదవాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఈ సభకు ముఖ్య వక్తగా విచ్చేసిన PDSO రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.సురేష్ మాట్లాడుతూ వందేమాతరం, సహాయ నిరాకరణ లాంటి అనేక ఉద్యమాలలో విద్యార్థులు యువకులు పెద్దయెత్తున పాల్గొని స్వాతంత్య్రోద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించారని, కానీ 75 ఏళ్లు గడిచినా ఇప్పటికీ సరియైన విద్య, వైద్యం, ఉపాధి లేమి, ఆర్థిక అసమానతలతో భారతదేశం ఉందనీ, ఈ స్వతంత్రం ప్రజలను దోచుకునే వారికి వచ్చింది తప్ప ప్రజలకు కాదని, విద్యా సంస్కరణల పేరుతో స్కూళ్లను మూసివేస్తున్నరని, ఈ సంవత్సరం అక్టోబర్ నెల వచ్చినా ఇంకా డిగ్రీ అడ్మిషన్లను పూర్తి చేయలేదని, నూతన జాతీయ విద్యా విధానం పేరుతో మొత్తం విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నారని కాబట్టి విద్యార్థులంతా విద్యరంగ సమస్యలపై భగత్ సింగ్, అల్లూరిల స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో PDSO నాయకులు S.రుద్రీ, P.మహేష్, సిహెచ్. అవినాష్, AMAL కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)