13 సెప్టెంబర్ షహీద్ జతిన్ దాస్ జైలులో అమరుడైన రోజు. జతిన్ దాస్ హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ల సోసియేషన్ సభ్యుడు, భగత్ సింగ్ సహచరుడు, లాహోర్ కుట్ర కేసులో భగత్ సింగ్ తదితరులకు సహా నిందితుడు.లాహోర్ జైలులో భారతీయ ఖైదీల పరిస్థితి చాలా దుర్భరంగా ఉండేది. వారు అనేక రోజులపాటు ఉతకని, మాసిన దుస్తులను ధరించవలసి వచ్చేది. వంటశాలలో బొద్దింకలు, ఎలుకలు తిరుగుతూ ఆహార పదార్థాలను తినడానికి హానికరంగా మార్చేవి. భారతీయ ఖైదీలకు వార్తాపత్రికలను, వ్రాసుకోవడానికి కాగితాలు ఇచ్చేవారు కాదు. కానీ అదే జైలులో బ్రిటిష్ ఖైదీల యూరోపియన్ ఖైదీలకు సమానంగా భారతీయ ఖైదీలకు సదుపాయాలను కల్పించాలని కోరుతూ జైలులో రాజకీయ ఖైదీల కనీస హక్కుల కోసం మరికొందరు విప్లవకారులతో కలిసి ఆమరణ నిరాహారదీక్షను చేపట్టాడు. ఈ ఆమరణ నిరాహారదీక్ష మొదలుయిన 63వ రోజు జతిన్ దాస్ ప్రాణాలు విడిచాడు. అప్పటినుంచి 13 సెప్టెంబర్ ని రాజకీయ ఖైదీల హక్కుల పోరాట దినంగా పాటిస్తున్నారు.

