# National unemployment day
# జాతీయ నిరుద్యోగ దినోత్సవం #PDSO ![]()
వస్త్ర పరిశ్రమ సంక్షోభం.
పోయిన ఉద్యోగాలు - 3 కోట్లు.
అంటే మూడుకోట్ల కుటుంబాలు.
కుటుంబానికి ఐదు మంది సభ్యులనుకున్నా దెబ్బతిన్న ప్రజలు 15 కోట్లమంది!
ఆటోమొబైల్ పరిశ్రమ సంక్షోభం.
పోయిన ఉద్యోగాలు 10 లక్షలు.
దెబ్బతిన్న ప్రజలు 50 లక్షలమంది!
తేయాకు పరిశ్రమ సంక్షోభం.
పోయిన ఉద్యోగాలు సుమారు 6 లక్షలు.
దెబ్బతిన్న ప్రజలు 30 లక్షల మంది!
భవన తదితర నిర్మాణ రంగ సంక్షోభం.
పోయిన ఉద్యోగాలు 2 కోట్లు.
దెబ్బతిన్న ప్రజలు 10 కోట్లమంది!
వ్యవసాయ రంగ సంక్షోభం.
పోయిన ఉద్యోగాలు 5 కోట్లపైనే.
దెబ్బతిన్న ప్రజలు 25 కోట్ల పైగా!
చిన్న తరహా పరిశ్రమలు, చిన్న వ్యాపార రంగాల సంక్షోభం. పోయిన ఉద్యోగాలు సుమారు 35 లక్షలు. దెబ్బతిన్న ప్రజలు 1.75 కోట్ల మంది!
ఈ స్థూలమైన లెక్కల ప్రకారమే గత రెండేళ్ళలో ఉద్యోగాలు కోల్పోయి వీధిన పడ్డ కుటుంబాల లెక్ఖ ఇది. సుమారు 52 కోట్లమంది ప్రజలు.
పట్టణ ప్రాంతాలలో ఉపాధి కోల్పోయి దిక్కులేకుండా పోయినవారినీ, గ్రామీణ చేతివృత్తుల వారినీ కూడా లెక్కబెడితే ఇంకా కొన్ని కోట్లమంది శ్రామిక ప్రజలు ఆకలితో కనిపిస్తారు..
దేశంలో సగం జనాభా ఉపాధి లేక, భుక్తిలేక, ఆకలి కడుపులతో, అప్పులతో, అనారోగ్యంతో, అశాంతితో ఛస్తూ వుంటే ఇవేవీ పట్టకుండా వున్న పాలకుల విధానాలపై చైతన్యవంతమైన యువత పోరాడకుండా వున్నంత కాలం పరిస్థితిలో మార్పు వుండదు.కావున ఈ సంక్షోభ సమయంలో ప్రగతిశీల యువతరం అల్లూరి, భగత్సింగ్ల స్పూర్తితో నిరుద్యోగం, పేదరికం, ఆకలి, ఆర్థిక సంక్షోభానికి కారణమైన పాలకుల విధానాలపై పోరాడాలని PDSO పిలుపునిస్తోంది.
17-09-2020

