వెటర్నరీ విద్యార్థుల న్యాయమైన పోరాటానికి పిడిఎస్ఓ సంఘీభావం!

0
    ఆంధ్రప్రదేశ్‌లో వెటర్నరీ జూనియర్ డాక్టర్లు స్టైఫండ్ పెంపు కోసం గత రెండు వారాలుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. ప్రస్తుతం వారికి కేవలం ₹7,000 మాత్రమే స్టైఫండ్ ఇస్తుండగా, ఇది వారి రోజువారీ అవసరాలకు కూడా సరిపోని పరిస్థితి. ఇతర వైద్య విద్యార్థులైన ఎంబిబిఎస్, బీడీఎస్, ఆయుష్ విద్యార్థులకు ₹25,000 నుండి ₹60,000 వరకు స్టైపెండ్ అందుతుండగా, వెటర్నరీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో వెటర్నరీ విద్యార్థులకు కనీసం ₹20,000 నుండి ₹24,000 వరకు స్టైపెండ్ ఇస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 13 ఏళ్లుగా ఈ సమస్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ వస్తోంది.
    ఫీల్డ్ వర్క్, క్లినికల్ ట్రైనింగ్ లో భాగంగా పశువుల సంరక్షణ కోసం గ్రామీణ ప్రాంతాల్లో వెటర్నరీ విద్యార్థులు కీలకమైన సేవలు అందిస్తున్నారు. ఇంటర్న్‌షిప్ సమయంలో అవసరమైన వసతులు లేకపోవడంతో, విద్యార్థులు తమ స్వంత డబ్బులతో ఖర్చులు భరించాల్సి వస్తోంది. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, ఇంటి అద్దెల భారం మధ్య ఈ తక్కువ స్టైఫండ్‌లో బతకడం దుర్భరంగా మారింది. ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు స్టైఫండ్ పెంపు విషయంలో గతంలో హామీలు ఇచ్చినా, వాటిని అమలు చేయకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం.
    ఈ పరిస్థితుల్లో వెటర్నరీ విద్యార్థుల న్యాయమైన పోరాటానికి పిడిఎస్ఓ సంఘీభావం తెలుపుతుంది. అలాగే స్టైఫండ్‌ను తక్షణమే 25 వేలకు పెంచాలని, విద్యార్థుల ఇతర డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పిడిఎస్ఓ డిమాండ్ చేస్తుంది.
విప్లవాభినందనలతో...
ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (PDSO),
ఆంధ్రప్రదేశ్
తేదీ: 22-02-2025,
విజయవాడ
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)