ఎస్వీ యూనివర్సిటీ

0
    ఎస్వీయూ ప్రిన్సెస్ వన్ ఉమెన్స్ హాస్టల్లోకి నిన్న రాత్రి రూమ్ లోకి పాము దూరడంతో PDSO మరియు ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ఎడి బిల్డింగ్ వద్ద నిరసన ఆందోళనకు దిగారు. గతంలో కూడా అనేకసార్లు ఎలుకలు, పాములు, వచ్చాయని వార్డెన్సుకి అనేకసార్లు విద్యార్థులు చెప్పినప్పటికీ పట్టించుకోలేదని, ఎస్.వి. యూనివర్సిటీ యాజమాన్యాలు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే కిటికీలకి మెస్ లు ఏర్పాటు చేయాలని, చుట్టుపక్కల ప్రదేశాలు, మరుగుదొడ్లు, కారిడార్లు రెగ్యులర్ గా క్లీన్ చేయాలని, హాస్టల్లో నీటి సమస్య, ఫుడ్ సమస్య పరిష్కరించాలని, ఎన్నిసార్లు మనవి చేసినప్పటికీ బాధ్యతారహితంగా వ్యవహరించిన వార్డెన్లపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని రిజిస్టర్ కు అందజేశారు.



Tags

Post a Comment

0Comments
Post a Comment (0)