ఎపి సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థినులకు భద్రత కల్పించాలి!

0
అనంతపురం జిల్లా, బుక్కరాయసముద్రం మండలం, జంతులూరు గ్రామం వద్ద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్శిటీ క్యాంపస్ గేటు ముందు ఫిబ్రవరి 16,2025 అర్ధరాత్రి సమయం వరకు విద్యార్థులు, విద్యార్థినులు నిరసన తెలిపారు. క్యాంపస్ బాలికల హాస్టల్ బాత్‌రూమ్‌లలోకి తెలియని వ్యక్తులు ప్రవేశించడం, తొంగి చూడటంతో విద్యార్థినులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు PDSO అనంతపురం జిల్లా కమిటీ సభ్యులు సంఘీభావంగా పాల్గొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుని, అవసరమైన అన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా బాలికల హాస్టల్ చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, విద్యార్థినులకు భద్రత కల్పించాలని, నిత్యం 24/7 క్యాంపస్ లో కరెంట్ ఉండేలా చూసుకోవాలని, సోలార్ విద్యుత్ సరఫరా వెంటనే ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేసారు.
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)