AU అనుబంధ కళాశాలలకు ఈ నెల 14 వ తేది నుండి డిగ్రీ మొదటి సంవత్సర (2 వ సెమ్), రెండవ సంవత్సర (4వ సెమ్) సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి. అందులో భాగంగా సైన్స్ విద్యార్థులకు ఈ నెల 5వ తేది నుండే ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించనున్నారు. అలాగే ఇంటర్ 2nd year, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, నర్సింగ్, ఐటిఐ తదితర కోర్సుల విద్యార్థులకు కూడా తరగతులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. కావున బీసీ కాలేజీ హాస్టల్స్ ను వెంటనే తెరవాలని డిడి గారిని కలిసి పిడిఎస్ఓ విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వగా, బిసి వెల్ఫేర్ డీడీ హాస్టళ్ళను తెరుస్తామని ఇచ్చారు.