స్టూడెంట్ ప్రత్యేక సంచిక

0
    భారతదేశంలో విద్యారంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. కేంద్రంలో మోదీ పదేళ్ళ పాలనలో, రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ళ పాలనలో విద్యా రంగంలో తీసుకొచ్చిన మార్పులు, చేపట్టిన విధానాలు ప్రభుత్వ విద్యను నాశనం చేసి, కార్పొరేట్, ప్రయివేట్ శక్తులకే మేలు చేశాయి. ఈ అస్తవ్యస్త విధానాల కారణంగా పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆపేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూలేనంత ఘోరంగా నిరుద్యోగం పెరిగిపోయింది. యువతకు నగరాలు, పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు దొరికే పరిస్థితి లేదు. ప్రతి యేటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని అధికారంలోకి వచ్చిన మోదీ కానీ, ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానన్న జగన్ మోహన్ రెడ్డి కానీ ఆచరణలో యువతను నిట్టనిలువునా ముంచేసారు. ఇటువంటి పరిస్థితుల్లో విద్యా, ఉపాధి హక్కులను విద్యార్థులు, యువజనులు పోరాడి సాధించుకోవడమే ఏకైక మార్గం. ఈ నేపథ్యంలో "విద్యా, ఉపాధి రంగాల్లో సంక్షోభం - పాలకుల విధానాలు - విద్యార్థి, యువజనుల కర్తవ్యాలు" అనే అంశంపై పిడిఎస్ఓ-ఎన్‌వైయస్ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో డిసెంబర్ 22, 2023 తేదీన గుంటూరులో రాష్ట్ర సదస్సును విజయవంతంగా నిర్వహించాం. ఆ సదస్సు విశేషాలను, వక్తలు మాట్లాడిన ఉపన్యాసాలను ప్రత్యేక సంచిక రూపంలో తీసుకువస్తున్నాం. అలాగే సామ్రాజ్యవాదీ అమెరికా అండతో పాలస్తీనాపై ఇజ్రాయిల్ చేస్తున్న దురాక్రమణ దాడులు, యుద్ధానికి వ్యతిరేకంగా పాలస్తీనా సంఘీభావ సభను అక్టోబర్ 27, 2023 తేదీన విజయవాడలో నిర్వహించాం. ఆ ఉపన్యాసాలు కూడా ఈ సంచికలో తీసుకువస్తున్నాం. మణిపూర్ మారణకాండ పైనా, ఆదివాసీ వ్యతిరేక చట్టసవరణల పైనా, సిలబస్ నుండి డార్విన్ సిద్ధాంతం తొలగింపు పైనా, మహిళా రెజ్లర్ ఆందోళన పైనా, క్రికెట్ ప్రపంచకప్ ఫలితాల పైనా యిటీవల రాష్ట్ర కమిటీ ప్రచురించిన కరపత్రాలను అనుబంధంగా యిస్తున్నాం. ఈ ప్రత్యేక సంచికను విద్యార్థులు, యువజనులు, ఉపాధ్యాయులు, మేథావులు చదివి, తమ ఆలోచనలు పంచుకుంటారని ఆశిస్తున్నాం.
విప్లవాభినందనలతో...
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (PDSO)
నవ యువ సమాఖ్య (NYS)
ఆంధ్రప్రదేశ్

Post a Comment

0Comments
Post a Comment (0)